హైదరాబాద్‌కు చెందిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ స్టార్టప్ కంపెనీ 'మివి' అభివృద్ధి చేసిన ఏఐ ఆధారిత వాయిస్ టూల్ సంచలనం సృష్టిస్తోంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : AI రంగంలో విప్లవాత్మక మార్పులు సంభవిస్తున్నాయి. ఇప్పటి వరకు మనం ప్రశ్నలు టైప్ చేస్తే ఆన్సర్స్ స్ట్క్రిప్ట్ లో వచ్చేవి. అయితే రీసెంట్ గా హైదరాబాద్‌కు చెందిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ స్టార్టప్ కంపెనీ 'మివి' అభివృద్ధి చేసిన ఏఐ ఆధారిత వాయిస్ టూల్ సంచలనం సృష్టిస్తోంది.
ఇప్పుడు ఏఐ మనుషుల్లా ఆలోచించి నీ బెస్ట్ ఫ్రెండ్ లాగా సంభాషించగల సామర్ధ్యం ప్రదర్శిస్తుంది. సంక్లిష్ట ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో పాటు సిట్యువేషన్ ను బట్టి ఇమిడియెట్ గా రియాక్ట్ అవుతుంది.దీన్ని 'మివి ఏఐ' పేరుతో అభివృద్ధి చేసినట్లు కంపెనీ కో-ఫౌండర్, CEO మిధులా దేవభక్తుని శుక్రవారం వెల్లడించారు.
"మివి ఏఐలో ఉపయోగించిన NLP (నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్) మానవుల భావోద్వేగాలను అర్థం చేసుకుంటుంది. హాయ్ మివి' అనే వేక్ వర్డ్‌ను రూపొందించాం. దీని వల్ల డిప్రెషన్ కు గురయ్యే వారి సంఖ్య తగ్గుతుంది. కంపెనీ ఇప్పటికే ఈ టూల్ ఆధారంగా ఏఐ ఇయర్ బడ్స్‌ను అభివృద్ధి చేసింది. ఈ ఏడాది జూన్‌లో ఈ బడ్స్ మార్కెట్లోకి విడుదల కానున్నాయి. దీని దర 10వేల కంటే తక్కువగా ఉండవచ్చంటున్నారు .