ఇస్రో ప్రతిష్టాత్మక స్పేడెక్స్ (స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ - SPADEX) మిషన్‌లో భాగంగా ఈ విన్యాసాలు జరుగుతున్నాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఇస్రో తన సత్తా మరోసారి చాటింది. భూమికి దాదాపు 500 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్న రెండు భారతీయ ఉపగ్రహాల మధ్య అత్యంత క్లిష్టమైన " స్పేస్ డాగ్ ఫైట్ " తరహా విన్యాసాలను విజయవంతంగా నిర్వహిస్తుంది, యుధ్ధ విమానాలు గగనతలంలో ఒక దానికొకటి దగ్గరగా వచ్చి చేసే విన్యాసాలను పోలి ఉండడంతో దీనికి ఈ పేరు పెట్టారు.
ఇస్రో ప్రతిష్టాత్మక స్పేడెక్స్ (స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ - SPADEX) మిషన్‌లో భాగంగా ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. గంటకు 28,800 కి.మీ (బుల్లెట్ కన్నా 10 రెట్లు వేగం) వేగంతో ప్రయాణిస్తున్న 'ఛేజర్', 'టార్గెట్' అనే ఉపగ్రహాలు ఇందులో పాలుపంచుకుంటున్నాయి. ఈ మిషన్‌లో రెండుసార్లు విజయవంతంగా డాకింగ్ , అన్‌డాకింగ్ ప్రక్రియలను పూర్తి చేసినట్లు ఇస్రో వర్గాలు ధృవీకరించాయి. ముఖ్యంగా రెండోసారి డాకింగ్ పూర్తిగా స్వయంప్రతిపత్తితో జరిగింది.
ఏప్రిల్ 21న ఒక ఉపగ్రహం నుంచి మరో ఉపగ్రహానికి విజయవంతంగా విద్యుత్‌ను బదిలీ చేసి, దాని శక్తితో హీటర్ ఎలిమెంట్‌ను పనిచేయించారు. ఈ ప్రయోగాల తర్వాత కూడా ఉపగ్రహాల్లో దాదాపు 50 శాతం ఇంధనం మిగిలి ఉండటం విశేషం. చైనా లాంటి దేశాలు ఈ ప్రయోగాన్ని ఇంకా టెస్ట్ చేస్తున్నారు. భారత్ దీన్ని చేసి చూపించడం అది కూడా స్వదేశీ పరిజ్ఞానంతో ముందడుగు వేయడం గమనార్హం.ఈ విజయం భవిష్యత్ చంద్రయాన్-4, ప్రతిపాదిత భారతీయ అంతరిక్ష కేంద్రం వంటి కీలక ప్రాజెక్టులకు బలమైన పునాది వేసింది.