Royal Enfield Electric Bike : రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ బైక్ ..ఫీచర్స్ సూపర్ !


రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎల్లప్పుడూ క్లాసిక్, స్ట్రాంగ్ బైక్‌లకు ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు కంపెనీ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ విభాగంలోకి ప్రవేశిస్తుంది.


Published May 16, 2025 12:25:00 PM
postImages/2025-05-16/1747378602_royalenfieldelectricmotorcycle.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: రాయల్ ఎన్ ఫీల్డ్ అభిమానులకు శుభవార్త . కంపెనీ ఇప్పుడు ఫస్ట్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ C6 రిలీజ్ చేయబోతుంది. Q4 FY26 నాటికి మార్కెట్లోకి రావచ్చు. ఈ రాయల్ ఎన్ ఫీల్డ్ ప్రత్యేకత ఏంటి ?


రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎల్లప్పుడూ క్లాసిక్, స్ట్రాంగ్ బైక్‌లకు ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు కంపెనీ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ విభాగంలోకి ప్రవేశిస్తుంది. C6 అనే ఈ బైక్ బ్రాండ్ ఎలక్ట్రిక్ జర్నీ ప్రారంభించడమే కాకుండా ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్ లో కొత్త ప్రమాణాలను కూడా సెట్ చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర రూ. 1.5 లక్షల నుంచి రూ.2 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా . అయితే కంపెనీ ఇంకా అధికారిక ధరను ప్రకటించలేదు.


డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ : స్పీడ్, బ్యాటరీ లెవల్, సింగిల్ స్క్రీన్‌ డేటా


మల్టీ రైడింగ్ మోడ్‌లు : ఎకో, స్పోర్ట్, నార్మల్ మోడ్‌లతో మెరుగైన రైడింగ్ ఎక్స్‌పీరియన్స్


రీజనరేటివ్ బ్రేకింగ్ : బ్రేకింగ్ చేసేటప్పుడు బ్యాటరీని రీఛార్జ్ చేసే టెక్నాలజీ


కనెక్టివిటీ ఆప్షన్లు : స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్, రియల్ టైమ్ అప్‌డేట్స్.


టాప్ రేంజ్ విషయానికి వస్తే C6 అధికారిక రేంజ్ ఇంకా వెల్లడి కాలేదు. ఈ బైక్ 120-150 కి.మీ వరకు రేంజ్ అందించగలదని చెబుతున్నారు. ఈ అంచనా సరైనది అయితే.. సిటీ, హైవే రైడింగ్‌కు బెస్ట్ రేంజ్ అందిస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌ను Q4 FY26 నాటికి జనవరి-మార్చి కల్లా  లాంచ్ చేయాలని యోచిస్తోంది. కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu electric-bike technology

Related Articles