AP: Deputy Cm: ముంపు ప్రాంతాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు వద్ద వరద ముంపునకు గురైన ప్రాంతాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు.


Published Sep 09, 2024 07:32:25 AM
postImages/2024-09-09/1725882992_deputyman.PNG

న్యూస్ లైన్ డెస్క్: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏలేరు ప్రొజెక్టుకు వరద పెరగడంతో నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. దీంతో పలు కాలువలకు గండ్లు పడింది. ఇక గొల్లప్రోలు వద్ద వరద ముంపునకు గురైన ప్రాంతాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వరద బాధిత గ్రామాలకు ఆర్థికసాయం ప్రకటన చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా వరదల కారణంగా దెబ్బతిన్న దాదాపు 400 గ్రామపంచాయతీలకు తన స్వార్జితం నుంచి రూ.4కోట్లు ప్రకటించారు. ఒక్కో పంచాయతీకి లక్ష రూపాయల చొప్పున పవన్ 4 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఈ ప్రకటించిన విరాళం చెక్కులను జనసేన పార్టీ శాసన సభ్యులు, ఎంపీలు, నాయకులు 19 ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నారు.
 

newsline-whatsapp-channel
Tags : india-people ap-news chandrababu andhrapradesh pawan-kalyan deputycm floods

Related Articles