ఒలింపియాడ్ 2024 లో భారత్ చరిత్రలో ఇదే మొదటిసారి గోల్డ్ సాధించడం. మహిళల టీం కూడా అధ్భుతమైన ప్రదర్శనతో గోల్డ్ గెలుచుకుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: చెస్ ఒలింపియాడ్ లో భారత్ రెండు గోల్డ్ మెడల్స్ ను గెలిచి చరిత్ర సృష్టించింది. ఆదివారం భారత గ్రాండ్‌మాస్టర్ డీ. గుకేశ్ రష్యా ఆటగాడు వ్లాదిమిర్ ను ఓడించారు.బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న చెస్ ఒలింపియాడ్ 2024 లో భారత్ చరిత్రలో ఇదే మొదటిసారి గోల్డ్ సాధించడం. మహిళల టీం కూడా అధ్భుతమైన ప్రదర్శనతో గోల్డ్ గెలుచుకుంది.
45వ ఫిడే (FIDE) పోటీల్లో భారత ప్లేయర్లు డీ గుకేశ్, ఆర్ ప్రజ్ఞానంద, అర్జున్ ఎరిగైసి, విడిత్ గుజరాతి, పెంటల హరికృష్ణ, శ్రీనాథ్ నారాయన్ వారి గేమ్ లో చాలా మంచి ప్రదర్శన కనబరిచారు. భారత పురుషుల జట్టు గోల్డో మెడల్ గెలుచుకుంది. అలాగే, మహిళల జట్టు కూడా స్వర్ణం సాధించింది. హారిక ద్రోణవల్లి, వైశాలి రమేష్‌బాబు, దివ్య దేశ్‌ముఖ్, వంటికా అగర్వాల్, తానియా సచ్‌దేవ్, అభిజిత్ కుంటే (కెప్టెన్). ఉన్నారు.
గుకేశ్ ఒలింపియాడ్‌లో అతని అత్యుత్తమ ప్రదర్శన 9/10 పాయింట్లు సాధించారు.దీంతో పర్సనల్ మెడల్ తో పాటు బోర్డు వన్ లో అతని నైపుణ్యం ప్రత్యర్ధికి చుక్కలు చూపించింది.హారిక ద్రోణవల్లి, ఆర్ వైశాలి, దివ్య దేశ్‌ముఖ్, వంటికా అగర్వాల్, తానియా సచ్‌దేవ్‌లతో ఉన్న టీం కూడా చాలా బాగా ఆడారు. అందరు తమ తమ ట్రిక్స్ ను పర్ఫెక్ట్ ప్లే చేసి భారత్ కు గోల్డ్ తీసుకువచ్చారు.
నవంబర్‌లో సింగపూర్‌లో జరిగే తదుపరి ప్రపంచ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌ని ఆడేందుకు సిద్ధంగా ఉన్న గుకేశ్ తన ర్యాంక్ ను మరింత మెరుగు పరుచుకున్నారు. భారత్ 17 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది, చైనా, అమెరికా, ఉజ్బెకిస్థాన్‌లు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. భారత్ గ్రాండ్ మాస్టర్స్ ర్యాంక్ ప్రపంచ దేశాల్లో మరింత మెరుగుపడడం చాలా సంతోషంగా ఉంది.