ఆదిలాబాద్ , కుమురంభీం ఆసిఫాబాద్ , మంచిర్యాల , జగిత్యాల జిల్లాల్లో ఎండ తీవ్రతతో పాటు వడగాలుల ప్రభావం అధికంగా ఉన్నట్లు పేర్కొంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: తెలంగాణలో ఉష్ణోగ్రతలు మార్చి నెలలోనే 40 డిగ్రీల పైకి చేరుకున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణంగా కంటే 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని తెలిపింది వాతావరణ శాఖ రానున్న రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశముందని తెలిపింది. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో 39 డిగ్రీలు నమోదవుతున్నట్లు వెల్లడించింది.
ఆదిలాబాద్ , కుమురంభీం ఆసిఫాబాద్ , మంచిర్యాల , జగిత్యాల జిల్లాల్లో ఎండ తీవ్రతతో పాటు వడగాలుల ప్రభావం అధికంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది. శనివారం మరో ఏడు జిల్లాల్లోను 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఈ జిల్లాలలకు ఎల్లో హెచ్చరికలు అమల్లోకి వస్తాయని తెలిపింది.