ప్రస్తుతం మార్కెట్ లో అనేక రకాల మొబైల్స్ ఉన్నాయి. ఇందులో మంచి ఆదరణతో దూసుకుపోతున్నటువంటి మొబైల్ ఐటెల్. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే చాలా రకాల వేరియంట్లు వచ్చాయి. కస్టమర్లు ఆదరణ కూడా పొందాయి. అలాంటి ఐటెల్ కంపెనీ అతి తక్కువ ధరలో ఐటెల్ కలర్ ప్రో 5జి మొబైల్ విడుదలవ్వబోతోంది. అలాంటి ఈ మొబైల్ యొక్క ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
న్యూస్ లైన్ డెస్క్:ప్రస్తుతం మార్కెట్ లో అనేక రకాల మొబైల్స్ ఉన్నాయి. ఇందులో మంచి ఆదరణతో దూసుకుపోతున్నటువంటి మొబైల్ ఐటెల్. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే చాలా రకాల వేరియంట్లు వచ్చాయి. కస్టమర్లు ఆదరణ కూడా పొందాయి. అలాంటి ఐటెల్ కంపెనీ అతి తక్కువ ధరలో ఐటెల్ కలర్ ప్రో 5జి మొబైల్ విడుదలవ్వబోతోంది. అలాంటి ఈ మొబైల్ యొక్క ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఐటెల్ కలర్ ప్రో 5జి 6.6 అంగుళాల HD+ డిస్ప్లేను కలిగి మీడియటెక్ డైమన్సిటీతో వస్తోంది. అంతేకాకుండా 6080 అక్టా కోర్ ప్రాసెసర్ కలిగి ఉంటుంది. ఇక ఈ మొబైల్ స్టోరేజ్ విషయానికొస్తే 6 జీబీ ర్యామ్ అదనంగా 6జీబీ వర్చువల్ ర్యామ్ మరియు 128gb నిలువ సామర్థ్యం ఉంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే 50 ఎంపీ AI డ్యూయల్ వెనుక కెమెరా మరియు సెల్ఫీ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది.
అలాగే ఈ మొబైల్లో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. దీని వెనుక భాగానికి సూర్యరష్మి తాకినప్పుడు వెనుక ఫ్యానెల్ యొక్క రంగు IVCO టెక్నాలజీ ద్వారా మారుతుంది. అంతేకాకుండా మారుమూల ప్రాంతాల్లో కూడా అద్భుతమైన 5జీ కనెక్టివిటీని కలిగి ఉంటుంది. NRCA వేగవంతమైన బ్రౌజింగ్ మరియు అంతరాయం లేనటువంటి కనెక్టివిటీ స్థిరమైన 5జీ కనెక్షన్ నిర్వహిస్తుంది.
ఈ ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్, ఎఫ్ఎం రేడియో వంటి అద్భుత ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13పై రన్ అవుతుంది. ఇక ఈ మొబైల్ ధర విషయానికి వస్తే రూ:9999తో అమెజాన్ లో ఇన్ లావెండర్ ఫాంటసీ మరియు రివర్ బ్లూ రంగులలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.