ఈ ఈవెంట్ కు మహారాష్ట్ర సీఎం దేవేంద్రఫ్రెడ్నవీస్ , రోహిత్ పేరెంట్స్ గురునాథ్ శర్మ, పూర్ణిమ హాజరయ్యారు. సీఎం తో కలిసి రోహిత్ పేరెంట్స్ ఈ స్టాండ్ ను ఓపెన్ చేశారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో ఓ స్టాండ్ కు అధికారికంగా రోహిత్ శర్మ పేరు పెట్టారు. ముంబయి క్రికెట్ అసోసియేషన్ శుక్రవారం ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ గా నిర్వహించింది. ఈ ఈవెంట్ కు మహారాష్ట్ర సీఎం దేవేంద్రఫ్రెడ్నవీస్ , రోహిత్ పేరెంట్స్ గురునాథ్ శర్మ, పూర్ణిమ హాజరయ్యారు. సీఎం తో కలిసి రోహిత్ పేరెంట్స్ ఈ స్టాండ్ ను ఓపెన్ చేశారు.
తన పేరుతో ఓ స్టాండ్ ఉన్న స్టేడియంలో మ్యాచ్లు ఆడబోతుండడం ప్రత్యేక అనుభూతి అని రోహిత్ అన్నాడు. క్రికెట్ స్టేడియంలో తన పేరు మీద ఓ స్టాండ్ ఉంటుందని కలలో కూడా అనుకోలేదని తెలిపారు. వాంఖడే లాంటి ప్రతిష్టాత్మక స్టేడియంలో ఎందరో దిగ్గజాల సరసన నా పేరు ఉండడం చాలా గర్వంగా ఉందని అన్నారు. తన భార్య చాలా ఎమోషనల్ అయ్యారు. రోహిత్ పేరెంట్స్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఐపీఎల్లో మే 21న ఇక్కడే మ్యాచ్ ఆడబోతుండడం జీవితంలో కొత్త అనుభూతిగా మిగలనుంది. టీమ్ఇండియాకు ప్రాతినిథ్యం వహిస్తూ ఈ మైదానంలో ఆడుతున్నప్పుడు మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది' అని రోహిత్ పేర్కొన్నాడు.