Jagadish Reddy: కవిత బెయిల్‌పై కాంగ్రెస్, బీజేపీలవి చిల్లర మాటలు 

ఎమ్మెల్సీ కవిత బెయిల్ అంశం మీద  కాంగ్రెస్ , బీజేపీల కామెంట్స్ పై మాజీమంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు.


Published Aug 28, 2024 05:43:55 AM
postImages/2024-08-28/1724835626_chillar.PNG

న్యూస్ లైన్ డెస్క్: ఎమ్మెల్సీ కవిత బెయిల్ అంశం మీద  కాంగ్రెస్ , బీజేపీల కామెంట్స్ పై మాజీమంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కవిత బెయిల్ అంశం పై కాంగ్రెస్, బీజేపీలవి చిల్లర మాటలు అని ఆయన అన్నారు. సుప్రీంకోర్టుని తప్పుబట్టే పద్ధతుల్లో కొంతమంది సోయిలేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇది నిరాధారమైన కేసు అని మొదటి నుండి తను చెబుతున్నాని, తాము ఊహించినట్లుగానే కవిత ముత్యంలా బయటకు వచ్చిందన్నారు. చరిత్రల్లో సీబీఐ, ఈడీలు నమోదు చేసిన పరమ చెత్త కేసుల్లో ఇదొకటి అని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్, కేజ్రీవాల్ ని ఇబ్బందిపెట్టడానికే ఈ కేసు పెట్టారని, విచారణ సందర్బంగా ఆధారాలు లేకపోవడంతో ఈడీ  సీబీఐ న్యాయవాదులు ఇబ్బందిపడ్డారని తెలిపారు.

నోట్ల కట్టలతో పట్టపగలు దొరికి అధికారం చలాయిస్తున్న మీరు నిరాధార కేసులో కవిత బెయిల్ పై వస్తే ఏడుపెందుకని ప్రశ్నించారు. టీ కాంగ్రెస్సే మోడీకి బీ టీమ్ గా పని చేస్తోందని, మోడీ దగ్గర రేవంత్‌కి ఉన్న ప్రాధాన్యత కిషన్ రెడ్డి, బండిలకు లేదన్నారు. రేవంత్ సీఎం కావడం మోడీ చాయిసే అని, వాల్మీకి కుంభకోణంలో టీ కాంగ్రెస్ నేతల ప్రమేయం ఉన్నా బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడంలేదని నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి కేసీఆర్ పై అక్కసు వెళ్లగక్కి వారి బలహీనతలను బయటపెట్టుకుంటున్నారని ఎద్దేవ చేశారు. లిక్కర్ కేసులో రాహుల్, రేవంత్ లు విరుద్ధంగా మాట్లాడుతున్నారని, అయితే గయితే పీసీసీ సహా తెలంగాణా కాంగ్రెసే బీజేపీ లో విలీనమౌతుంది అన్నారు. బీఆర్ఎస్ ఏ పార్టీలో విలీనం కాదు అని, ఎప్పటికయినా మోడీ , రాహుల్ కి ప్రత్యామ్నాయం కేసీఆరే అని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

newsline-whatsapp-channel
Tags : telangana mla brs congress bjp jagadish-reddy mlc-kavitha

Related Articles