Sunita Williams: సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా..అసలు ఇప్పుడు ఎలా ఉన్నారు ?

ఈ ఏడాది వారు భూమ్మీదకు రావడం కష్టమే అంటున్నారు నాసా సైంటిస్టులు.2025 ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉందంటున్నారు .


Published Aug 27, 2024 11:24:00 AM
postImages/2024-08-27/1724738140_Untitleddesign141696x392.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  అంతరిక్షంలో ఇరుక్కుపోయిన సునీతా ..విల్ మోర్ గురించి తెలిసిందే కదా. వీరి పై రోజు రోజుకీ భయాలు పెరిగిపోతున్నాయి.8 రోజులు కొత్త శాంటిలైట్ ప్రయోగాల కోసం వెళ్లారు. టెక్నికల్ ప్రాబ్లమ్ తో అక్కడే ఉండిపోయారు. ఇక వారిపై ఆశలు వదులుకోవాల్సిందే  . ఈ ఏడాది వారు భూమ్మీదకు రావడం కష్టమే అంటున్నారు నాసా సైంటిస్టులు.2025 ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉందంటున్నారు .


ముఖ్యంగా స్పేస్ క్రాఫ్ట్ భూమికి సురక్షితంగా తిరిగి రావాలంటే సర్వీస్ మాడ్యూల్ సరిగ్గా అతుక్కోవాలని…క్యాప్సూల్‌ను సరైన కోణంలో అంటిపెట్టుకుంటేనే వారు సేఫ్‌గా భూమికి పైకి తిరిగి రాగలుగుతారని చెబుతున్నారు. మాడ్యూల్ సరైన యాంగిల్ లేకపోతే నేల చేరేటప్పుడు వారు ప్రాణాలతో బయటపడడం చాాలా కష్టమని తెలిపారు.


ఒక వేళ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ సరిగ్గా పని చేయకుండా అంతరిక్షంలోనే నిలిచిపోతే అప్పుడు అందులో కేవలం 96 గంటలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే ఉంటుంది. పొరపాటున తేడా కొడితే భూమ్మీదకు రాకముందే ఆక్సిజన్ ఖాళీ అయ్యి వారికి చనిపోయే ప్రమాదం ఉంది.


క్యాప్సుల్  సరిగ్గా అతుక్కోకపోయినా ఆర్బిట్ లోనే తిరుగుతారు. ఇది కూడా జరిగే ప్రమాదం ఉంది. ఈ మూడు ప్రాబ్లమ్స్ ను విలియమ్స్ వారు దాటగలిగితే ..వారు ప్రాణాలతో భూమికి చేరుతారని చెబుతున్నారంటున్నారు నిపుణులు.
 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu earth

Related Articles