IPHONE: ఐఫోన్ లవర్స్ కు గుడ్‌న్యూస్.. ఐఫోన్ 16 విడుదల తేదీ ఖరారు!

స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో ఈవెంట్ ను నిర్వహించనున్నట్టు ‘యాపిల్ ‘ఇట్స్ గ్లో టైమ్’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ పార్టీ జరగబోతుంది.


Published Aug 27, 2024 03:54:00 PM
postImages/2024-08-27/1724754412_hq720.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఐఫోన్ లవర్స్ గుడ్ న్యూస్ ఐఫోన్-16 విడుదల తేదీకి ముహూర్తం ఖరారైంది. ఒక్క ఇండియాలోనే కాదు..అన్ని దేశాల్లోను ఐఫోన్ క్రేజ్ తెలిసిందేగా.కిడ్నీ అమ్మైనా ఫోన్ కొనుక్కోవాలనుకునేవారు బోలెడు మంది. ప్రతి ఎడిషన్ కు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.


 కాలిఫోర్నియాలో కుపెర్టినోలోని యాపిల్ పార్క్‌లో ఉన్న స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో ఈవెంట్ ను నిర్వహించనున్నట్టు ‘యాపిల్ ‘ఇట్స్ గ్లో టైమ్’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ పార్టీ జరగబోతుంది. అన్ని ఇంటర్నేషనల్ మీడియా సంస్థలకు  ఇన్విటేషన్స్ కూడా పంపారు. ఐఫోన్16 ఫోన్లను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. యాపిల్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, ఏఐ-ఆధారిత యాపిల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లను ప్రకటించే ఛాన్స్ ఉంది.


ఈ ఏడాది హార్డ్‌వేర్ మార్పులు పెద్దగా ఉండకపోవచ్చంటున్నారు. హార్డ్‌వేర్ అప్‌డేట్స్‌లో ఐఫోన్ చిప్‌సెట్‌ అప్‌గ్రేడ్‌ ఉండొచ్చని అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని స్మార్ట్ ఫోన్స్ ఆపిల్ ఇంటెలిజెన్స్ కు సపోర్ట్ చేస్తుందంటున్నారు.ఐఫోన్ లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందంటే అదే..స్మార్ట్ ఫోన్ లాగా అన్ని యాప్స్ సపోర్ట్ చెయ్యదు. కాని ఇప్పుడు వస్తున్న ఐఫోన్ 16 లో మాత్రం అలా కాకుండా అన్ని యాక్సప్ట్ చేసేలా ఉంటుందంటున్నారు .ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ ఫోన్లు మాత్రమే అవసరమైన ప్రాసెసింగ్ కెపాసిటీ కలిగి ఉన్నాయి. ఐఫోన్ లవర్స్ కు 16 పై చాలా అంచనాలున్నాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu apple-phone

Related Articles