పర్ఫెక్ట్ ఫ్యామిలీ సినిమా . వల్గర్ డైలాగులు కాని అసభ్యకరమైనవి కాని ఏం ఉండవు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రుత్విక్ యెలగరి అనే యంగ్ డైరెక్టర్ తెరకెక్కించిన చిత్రం 'తత్వ'. నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా తత్వ . ఈ సినిమా లో క్యారక్టర్లు జస్ట్ మూడే మూడు క్యారక్టర్లు. పర్ఫెక్ట్ ఫ్యామిలీ సినిమా . వల్గర్ డైలాగులు కాని అసభ్యకరమైనవి కాని ఏం ఉండవు.
ఆరిఫ్ (హిమ దాసరి) ఓ క్యాబ్ డ్రైవర్. అయితే అతడు వ్యాపారవేత్త థామస్ (ఉస్మాన్ ఘని) హత్య కేసులో అనుకోకుండా ఇరుక్కుంటాడు. ఆ విషయం అయితే మీడియాలో చాలా హైలెట్ అవుతుంది. డీసీపీకి కాబోయే కోడలు , పోలీస్ ఆఫీసర్ జ్యోత్స్న బరిలోకి దిగుతుంది. అయితే దేవుడే తనతో చేయించాడని చెబుతారు. జ్యోత్స్న ఎంత ప్రయత్నించినా కూడా అతడి నుంచి వచ్చే సమాధానమిదే. థామస్ మర్డర్ కు ఏ విషయాలు కారణం ..ఆ కేసును ఎలా డీల్ చేయాలనుకుంటున్నారు అనేదే సినిమా.
"దేవుడెక్కడో లేడు సాటి మనిషిలోనే ఉన్నాడు" అనే విషయాన్ని తనదైన శైలిలో చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్ రుత్విక్. ఓ క్యాబ్ డ్రైవర్ , బిజినెస్ మ్యాన్ , పోలీస్ ఆఫీసర్ ఇలా మూడు పాత్రలే ఈ కథ. నిజానికి సినిమా రన్ టైమ్ 58 నిమిషాలు . ఎమోషనల్‌గా స్టార్ట్ అయ్యి, వ్యాపారి హత్యకు గురికావడం, దానికి సంబంధిత కేసు ఇన్వెస్టిగేషన్‌తో ఉత్కంఠగా మారుతుంది. క్యాబ్ డ్రైవర్ ఆరిఫ్ నుంచి పోలీసు అధికారిణి జ్యోత్స్న నిజం తెలుసుకునే క్రమంలో దేవుడి అంశం తెరపైకి వస్తుంది. స్టోరీ చాలా ఇంట్రస్టింగ్ గా నడుస్తుంది. నిశ్చింతగా హ్యాపీ గా ఫ్యామిలీతో ...ఎంజాయ్ చేసే సినిమా.