అమెరికా కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ ప్రాంగణంలో రోబో నడిపే రకరకాల కార్లను ప్రదర్శించి టోటల్ వరల్డ్ కు షాక్ ఇచ్చారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: వెహికల్ తయారీ దిగ్గజం టెస్లా కొత్త కలల వ్యానుకు ఊపిరిపోసింది. మానవుల ఊహాలకు ..తన క్రియేటివిటీ కలిపి చాలామంది కలలు నిజం చేసింది. టెస్లా CEO ఎలాన్ మస్క్ రోబో వ్యాన్ , రోబో కార్లను ప్రపంచానికి పరిచయం చేశారు. అమెరికా కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ ప్రాంగణంలో రోబో నడిపే రకరకాల కార్లను ప్రదర్శించి టోటల్ వరల్డ్ కు షాక్ ఇచ్చారు. రోబో వ్యాన్ నార్మల్ డిజైన్ల కంటే చాలా డిఫరెంట్ గా ఉంది.
రైలు ఇంజిన్ వంటి డిజైన్‌లో రోబో వ్యాన్‌ను రూపొందించారు. రోబో వ్యాన్ చక్రాలు కనిపించకపోవడం మరో స్పెషల్ అట్రాక్షన్ . ఈ రోబో వ్యాన్‌లో 20 మంది ప్రయాణికులు లేదా అంతే బరువు గల సరకులను సులువుగా ఎక్కడ నుంచి ఎక్కడికైనా తరలిస్తుంది. చాలా వరకు ఇది కమర్షియల్ పర్పస్ ఉపయోగపడుతుంది. టెస్లా ఇప్పటి వరకు చిన్న చిన్న వెహికల్స్ ను మాత్రమే ఇంట్రడ్యూస్ చేసింది. ఇఫ్పుడు ఇలా ఎక్కువ మంది ప్రయాణించే కార్లు పరిచయం చెయ్యడం అధ్భుతంగా ఉందంటున్నారు నెటిజన్లు.
రోబో వ్యాను నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువే. ఒకటిన్నర కిలోమీటర్ల ప్రయాణానికి భారత కరెన్సీలో కేవలం 11రూపాయల ఖర్చు అవుతుంది. భారత్ లాంటి పెద్ద కంట్రీస్ లో ..జనాభా ఎక్కువ గా ఉన్న ప్రదేశాల్లో మాత్రం ఈ వెహికల్ చాలా ఉపయోగపడుతుందంటున్నారు.ఈ కారును నడపడానికి డ్రైవర్లు అవసరం లేదు. కేవలం అటానమస్ సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్‌తో దీన్ని నిర్మించినట్లు టెస్లా కంపెనీ వివరించింది. ఒకే కారులో 20మంది ప్రయాణించగల వాహనాన్ని రూపొందించి , టెస్లా సామూహిక ప్రయాణ వాహన తయారీ విభాగంలోకి కూడా ప్రవేశించినట్లైంది.