VIRUS : ఫీచర్స్ బాగున్నాయని ఈ యాప్ వాడుతున్నారా..డేంజర్ లో ఉన్నారు జాగ్రత్త !

మన డేటా మొత్తం వాళ్ల  చేతిలోకి వెళ్తుంది. ఫొటోలు , వీడియోలు అన్నీ వారి చేతిలో ఉంటాయి.టెక్నాలజీ పెరిగాక హ్యాకర్లు కూడా పెరిగిపోతున్నారు


Published Oct 02, 2024 05:58:00 PM
postImages/2024-10-02/1727872166_NecroTrojanilmalwarecherubaidatideituoismartphoneAndroid.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేకపోతే మనషి డమ్ ...ఏం లేనట్టే ..పట్టుమని పది నెంబర్లు గుర్తు పెట్టుకోలేం. డబ్బు ను చేత్తో పట్టుకోలేం. అయితే చాలా మంది ఫోన్ చూస్తున్నపుడు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఆ కంగారులో ఓకే చేసేస్తుంటారు. కాని అది చాలా డేంజర్ . మనకే తెలీకుండా మన డేటా మొత్తం వాళ్ల  చేతిలోకి వెళ్తుంది. ఫొటోలు , వీడియోలు అన్నీ వారి చేతిలో ఉంటాయి.టెక్నాలజీ పెరిగాక హ్యాకర్లు కూడా పెరిగిపోతున్నారు


ప్రస్తుతం నెక్రో ట్రోజన్ అనే వైరస్ వచ్చింది. ఇది ఆండ్రాయిడ్ యూజర్లను టార్గెట్ చేస్తోంది. అన్‌అఫీషియల్‌గా ఉన్న యాప్స్, గేమ్స్ డౌన్లోడ్ చేస్తే ఈ వైరస్ ఫోన్‌లోకి వస్తుంది. ఫీచర్లు బాగున్నాయని డౌన్ లోడ్ చేస్తే  ఈ మొబైల్ లో ఉన్న డేటా అంతా పోతుంది . అంతే కాదు ఫోన్ పే కూడా హ్యాక్ అయ్యి ..డబ్బులు పోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇక ఈ వైరస్ ని గుర్తించడం ఎలాగో తెలుసుకుందాం.


‘వూటా కెమెరా’ (Vuta Camera), ‘మ్యాక్స్‌ బ్రౌజర్’ (Max Browser). ఒకవేళ మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే, కచ్చితంగా అన్‌ఇన్‌స్టాల్ చేయండి. ఎందుకంటే ఈ రెండు యాప్స్ నెక్రో ట్రోజన్ వైరస్‌ను చాలా ఈజీగా స్ప్రెడ్ చేస్తున్నాయి. రీల్స్ చేసే వారు...యూట్యూబ్ వీడియోలు చేసేవారు ఎక్కువగా ఈ యాప్స్ వాడుతుంటారు. వారికి రిస్క్ తెలీకపోవచ్చు.మ్యాక్స్‌ బ్రౌజర్‌ను కూడా లక్ష మందికి పైగా వాడుతున్నారు. కాబట్టి ఈ యాప్స్ ఉంటే కచ్చితంగా డిలేట్ చెయ్యండి. లేదంటే మీ ప్రైవసీ , డబ్బు రెండు పోతాయి.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu mobile-app mobile-phone technology

Related Articles