MAHENDRA: మహీంద్రా నుంచి అద్దిరిపోయే ఈవీ ట్రక్ ..160KM రేంజ్!

డ్రైవర్లకు ఇలాంటి ట్రక్ లు నిజంగా వరమనే చెప్పాలి. టాటా , మహీంద్రా కంపెనీలకు చెందిన వెహికల్స్ మార్కెట్లోకి ఎక్కువగా వస్తుంటాయి. నిజానికి మధ్యతరగతి వారికి ఇలాంటి వెహికల్స్ ఎక్కువ లాభాన్ని ఇస్తుంటాయి.


Published Oct 07, 2024 06:07:00 PM
postImages/2024-10-07/1728304728_MahindraZeo304d7c33e4.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కు మంచి డిమాండ్ ఉంది. సిటీల్లో వస్తువుల రవాణాలకు , రకాల వస్తువులు డెలివరీ చేయడానికి ముఖ్యంగా లాజిస్టిక్స్ పనులకు బాగా యూజ్ అవుతాయి. వీటిని నమ్ముకొని చాలా కుటుంబాలు బ్రతుకుతున్నాయి.  డ్రైవర్లకు ఇలాంటి ట్రక్ లు నిజంగా వరమనే చెప్పాలి. టాటా , మహీంద్రా కంపెనీలకు చెందిన వెహికల్స్ మార్కెట్లోకి ఎక్కువగా వస్తుంటాయి. నిజానికి మధ్యతరగతి వారికి ఇలాంటి వెహికల్స్ ఎక్కువ లాభాన్ని ఇస్తుంటాయి. అయితే ఏం ఫీచర్లు ఉన్నాయో చూద్దాం రండి.


దీని పేరు మహీంద్రా Zeo. ఇది చిన్న ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్. ఇది రెండు వేరియంట్‌లలో వస్తుంది. దీని ప్రైజ్ రూ. 7.52 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది నార్మల్ కమర్షియల్ వెహికల్స్ తో పోలిస్తే చాలా బెటర్. ఏడేళ్లలో దాదాపు 7 లక్షలు ఆదా చేసుకోవచ్చంటుంది కంపెనీ. 


ఈ ట్రక్ గంటకు 60 కిలోమీటర్ల మాక్సిమం స్పీడ్, 765 కిలోల వరకు పేలోడ్ స్ట్రెంత్ ని ఇస్తుంది. దీనిలో 2.250 mm కార్గో బాక్స్ ఉంటుంది. దీని రేంజ్ విషయానికి వస్తే సూపర్ అనే పదం సరిపోదు. దీని ద్వారా 160 కిమీ వరకు రియల్ టైం వరల్డ్ డ్రైవింగ్ రేంజ్ పొందవచ్చు. దీనితో కేవలం 60 నిమిషాల్లో 100 కి.మీ రేంజ్ దాకా ప్రయాణించవచ్చు. ఇందులో 3.3 kw ఆన్‌బోర్డ్ ఛార్జర్‌తో సహా చాలా చార్జింగ్ కాన్ఫిగరేషన్‌లు ఉంటాయి.


ఈ వెహికల్ కి ఏడు సంవత్సరాల లేదా 1.5 లక్షల కిలోమీటర్ల బ్యాటరీ వారంటీని ఇస్తారు. అదనంగా, మహీంద్రా సఫర్, సఫర్ ప్లస్ ప్లాన్‌ల కింద రెండు సర్వీస్ ప్యాకేజీలను కూడా ఇస్తారు.ఇందులో డిపార్చర్ వార్నింగ్ తో పాటు నడిచివెళ్లే వారి కోసం కూడా వార్నింగ్స్ ఉన్నాయి.ఈ వెహికల్ ఏఐ-ఎనేబుల్డ్ కెమెరాతో వస్తుంది. ఈ కారులో డ్రైవర్ బిహేవియర్ ని యనాలసిస్ చేసే ఫీచర్ కూడా ఉంటుంది. ఇందులో హిల్ హోల్డ్ అసిస్ట్‌ ఫీచర్, మోటార్ వాటర్, డస్ట్ ప్రూఫ్ కోసం ఐపీ67 కూడా ఉంటుంది. తక్కువ ధరతో హైఎండ్ ఫీచర్స్ తో కమర్షియల్ ట్రక్ లో కనిపించవు. కానీ దీంట్లో ఇవన్నీ వస్తాయి. 
 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu vehicals mahendran

Related Articles