ISRO: 8ఏళ్ల తర్వాత నేలకు చేరిన PSLV-C3 రాకెట్ శకలాలు !

2017లో ఇస్రో ఒకేసారి 104 శాటిలైట్స్‌ని అంతరిక్షంలో వివిధ ఆర్బిట్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించింది.


Published Oct 09, 2024 12:04:00 PM
postImages/2024-10-09/1728455727_pslvc37isro11487153014574.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: 2017లో ఇస్రో ఒకేసారి 104 శాటిలైట్స్‌ని అంతరిక్షంలో వివిధ ఆర్బిట్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించింది. యితే శాటిలైట్స్ ని మోసుకెళ్లిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV C3 రాకెట్ శకలాలు అట్లాంటిక్ మహాసముద్రంలో సురక్షితంగా కూలిపోయినట్లు ఇస్రో కన్ఫర్మ్ చేసింది.. దాంట్లో కార్టోశాట్‌-2Dని ప్ర‌ధాన‌ పేలోడ్‌గా, 103 శాటిలైట్ల‌ను కో-ప్యాసింజెర్స్‌గా తీసుకెళ్లారు. ఇందులో భారత్​కు చెందిన నానో శాటిలైట్స్, వివిధ దేశాలకు చెందిన చిన్న ఉపగ్రహాలు ఉన్నాయి.


2017 లో ఈ రాకెట్ల ప్రయోగించిన అరగంటలోనే అన్ని ఉపగ్రహాలను వాటి కక్ష్యలోకి చేరింది. 2017లో భారతీయ శాస్త్రవేత్తలు ఈ అద్భుతాన్ని సాధించడమే కాకుండా ప్రపంచ రికార్డు కూడా సృష్టించారు. అప్పట్లో భారత్ చేసిన ఈ సాహసానికి నాసా కూడా ఆశ్చర్యపోయింది. ఇస్రో శాస్త్రవేత్తలు ఆ విడిభాగాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు ట్రాక్ చేస్తూనే ఉన్నారు. కాని ఈ మధ్యే ఈ శాటిలైట్ ట్రాక్ లో లేదని అనౌన్స్ చేసింది . భూవాతావరణంలో ఉన్న అయంస్కాంత శక్తి క్షీణించింది. దీంతో అక్టోబర్ 6 వ తేదీన PSLV C3 రాకెట్ భూమిపైకి వచ్చేసినట్లు ఇస్రో అధికారులు వెల్లడించారు. 


ఉత్తర అట్టాంటిక్ సముద్రంలో ఈ రాకెట్ భూమిపైకి వచ్చినట్లు ఇస్రో అధికారులు తెలిపారు.. IS4OM, యూఎస్ స్పేస్ కమాండ్ రెండూ ఊహించినట్లుగానే PSLV C3 రాకెట్ శకలాలు 2024 అక్టోబర్ 6వ తేదీన ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో పడిపోయాయి.  రాకెట్ భూ వాతావరణంలోకి చేరుతున్న టైంలో రాకెట్ PS4 దెబ్బతినకుండా ఇస్రో చాలా చర్యలు తీసుకుంది. 

Related Articles