కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్యను తప్పిస్తే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పడిపోతుందని కర్ణాటక మంత్రి సతీష్ జార్కిహోళి అన్నారని విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఎలాంటి అధరాలు లేకుండానే ఆయన ఇటువంటి మాటలు అనరు కదా అని ఆయన ప్రశ్నించారు.
న్యూస్ లైన్ డెస్క్: BRS నేత పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం కూలిపోనుందని ఆయన అన్నారు. ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారిన కర్ణాటక వాల్మీకి స్కాం కుంభకోణంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్యను తప్పిస్తే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పడిపోతుందని కర్ణాటక మంత్రి సతీష్ జార్కిహోళి అన్నారని విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఎలాంటి అధరాలు లేకుండానే ఆయన ఇటువంటి మాటలు అనరు కదా అని ఆయన ప్రశ్నించారు. వాల్మీకి స్కాంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల పాత్రను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే కర్ణాటక
నుంచి తెలంగాణకు డబ్బులు వచ్చాయని ఆయన తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు గవర్నమెంట్ ఖాతాలోని రూ.187 కోట్లు అక్రమంగా దారిమళ్లినట్లు అసెంబ్లీలోనే కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఒప్పుకున్నారని ఆయన అన్నారు. V6 బిజినెస్ సొల్యూషన్స్ అనే కంపెనీ ఖాతాకు రూ. 4.5 కోట్లు తరలించినట్లు ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారు.
ఆ వాల్మీకి స్కాం డబ్బుతోనే తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కోసం ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ స్కాంపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. ఈడీ దర్యాప్తు కూడా కొనసాగుతోంది కాబట్టి దీనిపై బీజేపీ కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.