మన ఇండియాలో చాలామంది ఆడవాళ్లు ఇంటి పనులు చేసుకుంటూ ఇంట్లోనే ఎక్కువగా ఉంటూ ఉంటారు. కుటుంబ బాధ్యతలు అన్ని వారే మోస్తారు. వారి ఆరోగ్యం పాడైన సరే కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని హ్యాపీగా
న్యూస్ లైన్ డెస్క్: మన ఇండియాలో చాలామంది ఆడవాళ్లు ఇంటి పనులు చేసుకుంటూ ఇంట్లోనే ఎక్కువగా ఉంటూ ఉంటారు. కుటుంబ బాధ్యతలు అన్ని వారే మోస్తారు. వారి ఆరోగ్యం పాడైన సరే కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని హ్యాపీగా ఉంచేందుకు చాలా వర్క్ చేస్తూ ఉంటారు. అలా ఇంటికి పరిమితమైనటువంటి చాలామంది ఆడవాళ్లకు వారికి తెలియకుండానే అనేక వ్యాధుల బారిన పడుతున్నారట. ప్రస్తుత కాలంలో ఆడవారికి ఎక్కువగా వచ్చే వ్యాధులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రక్తహీనత:
పురుషులతో పోలిస్తే ఆడవాళ్ళలో ఈ రక్తహీనత సమస్య అనేది ఎక్కువగా వస్తుందట. వీరికే ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం వారికి ప్రతి నెలా వచ్చే నెలసరి. ఈ టైంలో వారికి ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం అవ్వడం వల్ల రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇండియాలో 70 శాతం మంది మహిళలే ఐరన్ లోపం వల్ల రక్తహీనత బారిన పడుతున్నారట.
మానసిక ఆరోగ్యం:
ముఖ్యంగా మగవాళ్ళు మానసికంగా దృఢంగా ఉంటారు. ఆడవాళ్లు చాలా సున్నితంగా ఉంటారు. మగవారితో పోలిస్తే ఆడవాళ్ళ మానసిక ఆరోగ్యం తొందరగా దెబ్బతింటుంది. దీనికి ప్రధాన కారణం ఒత్తిడి,గృహహింస ఇలా ఎన్నో కారణాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.
క్యాన్సర్:
మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళలో ఎక్కువగా రొమ్ము క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇండియాలో రొమ్ము క్యాన్సర్ తో బాధపడే వారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. ఈ క్యాన్సర్ కేసుల్లో ప్రపంచంలోనే మన దేశం మూడవ స్థానంలో నిలిచింది.
బోలు ఎముకల వ్యాధి:
చాలామంది ఆడవాళ్లు క్యాల్షియం లోపం వల్ల ఎముకల వ్యాధి బారిన పడుతూ ఉంటారు. దీనివల్ల వీరి ఎముకలు బలహీనంగా మారి బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది. దీనికి ప్రధాన కారణం క్యాల్షియం సమస్య. కాబట్టి ఆడవాళ్లు కుటుంబ భాద్యత తో పాటు వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని నిపుణులు అంటున్నారు.