చాలా ఆలస్యమైందని.. ఇప్పటికైనా సీఎం స్పందించి తమకు పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థులు కోరారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో తాజాగా మరోసారి ఆయన నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. బుధవారం రేవంత్ రెడ్డి ఇంటి ఆవరణలో గురుకుల టీచర్ అభ్యర్థులు నిరసన చేపట్టారు. సీఎం స్పందించి తమకు పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్(congress) అధికారంలోకి వచ్చి 7 నెలలు అయిందో లేదో అప్పుడే.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలే దర్శనమిస్తున్నాయి. మొన్నటి దాకా దాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు నిరసనలు చేపట్టారు. మరోవైపు తమకు పోస్టింగ్స్ ఇవ్వాలని గత కొంత కాలంగా నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి(Revanth reddy) చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్స్(Appointment) తీసుకున్న గురుకుల టీచర్ అభ్యర్థులు ఇటీవల జూబ్లీహిల్స్(Jubilee hills)లోని ఆయన నివాసానికి వెళ్లారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు తమకు రేవంత్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. అయితే, ఇప్పటి వరకు పోస్టింగ్‌లు ఇవ్వలేదు. కొన్ని రోజుల వరకు ఎన్నికల కోడ్ ఉందని పోస్టింగ్ ఇవ్వలేదు. అయితే, ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల ఫలితాలు కూడా రావడంతో ఎలక్షన్ కోడ్(election code) కూడా ముగిసింది.
దీంతో అభ్యర్థులు ఇటీవల రేవంత్ రెడ్డి నివాసం వద్ద నిరసన చేపట్టారు. చాలా ఆలస్యమైందని.. ఇప్పటికైనా సీఎం స్పందించి తమకు పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థులు కోరారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో తాజాగా మరోసారి ఆయన నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. బుధవారం రేవంత్ రెడ్డి ఇంటి ఆవరణలో గురుకుల టీచర్ అభ్యర్థులు నిరసన చేపట్టారు. సీఎం స్పందించి తమకు పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొంత మంది మహిళా అభ్యర్థులు మోకాళ్లపై కూర్చొని కొంగుచాచి పోస్టింగ్స్ ఇవ్వాలని అడుక్కుంటున్నారు. ఇక దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో రైతులు, విద్యావంతులు అనే తేడా లేకుండా అందరినీ అడుక్కునే స్థితికి కాంగ్రెస్ తీసుకొచ్చిందని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.