దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం మంత్రి పొన్నం ప్రభాకర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెక్కులను పంపిణీ చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని అధికారులను కోర్టు ప్రశ్నించింది.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కల్యాణ లక్ష్మి పథకం కింద గత BRS ప్రభుత్వం ఇచ్చిన రూ. లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్(congress) నేతలు హామీ ఇచ్చారు. ఈ రకంగానే అసెంబ్లీ ఎన్నికల(assembly elections) సమయంలో అధికారంలోకి కూడా వచ్చారు. అయితే, తాము ఇస్తామన్న తులం బంగారం కాదు కదా.. అసలు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పక్కన పెడితే.. BRS అధికారంలో ఉండగా మంజూరైన చెక్కులను కూడా పంపిణీ చేయనివ్వకుండా నిలిపివేశారు.
ఓవైపు లబ్ధిదారులు మరోవైపు ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు ప్రశ్నిస్తున్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి(Revanth reddy) ఇప్పటికీ ఈ అంశంపై ఒక్కసారి కూడా స్పందించలేదు. దీంతో సర్కార్ తీరుపై లబ్ధిదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పలు మార్లు ప్రశ్నించినప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు. కాగా, హుజూరాబాద్(Huzur Abad) BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Koushik reddy) పంపిణీ చేస్తామన్న కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు విరమించారు. అయితే, ఈ నెల 27 వరకు చెక్కులు పంచకుంటే బౌన్స్ అయ్యే ప్రమాదం ఉందని పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టు(HI court)లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. చెక్కులను త్వరగా పంచడానికి అనుమతులు ఇప్పించాలని కోరుతూ పాడి కౌశిక్ రెడ్డి తన పిటిషన్ ద్వారా కోరారు.
తాజాగా, దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం మంత్రి పొన్నం ప్రభాకర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెక్కులను పంపిణీ చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని అధికారులను కోర్టు ప్రశ్నించింది. చెక్కుల పంపిణీలో ఎందుకు ఆలస్యమైందనే దానిపై అధికారులు వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించింది.