పాడి కౌశిక్ రెడ్డి వీణవంక లోనితన ఇంట్లో తడిబట్టలతో, ఎలాంటి అవినీతి చేయలేదని, వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేశారు.
న్యూస్ లైన్ డెస్క్ : హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kowsik reddy) మంత్రి పొన్నంప్రభాకర్ (Ponnam Prabhakar) రూ.100కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణ చేశారు. దాన్ని నిరూపించడానికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎక్కడికైనా వచ్చి నిరూపిస్తా, అవినీతి చేయలేదని పొన్నం నిరూపించుకోవాలని అని సవాల్ విసిరారు. అయితే దానికి ప్రతిస్పందిస్తూ కౌశిక్ రెడ్డి ఉద్యోగాల పేరుతో, ఇసుక మాఫియా, రైస్ మిల్లర్ల వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారని, దానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో మంగళవారం ఉదయం 11 గంటలకు హుజురాబాద్ (Huzurabad) నియోజకవర్గం లోని చెల్పూర్ ఆంజనేయస్వామి వద్దకు వస్తున్నామని ప్రమాణం చేయాలని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఓడితల ప్రణవ్ ( Voditala Pranav) ప్రతి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో సవాల్ ను స్వీకరించి మంగళవారం ఉదయం చేల్పూర్ హనుమాన్ గుడి వద్దకు వెళ్లడానికి ప్రయత్నించిన కౌశిక్ రెడ్డిని పోలీసులు వెళ్లకుండా హౌజ్ అరెస్ట్ చేశారు. దీంతో వీణవంక లోని తన ఇంట్లో తడిబట్టలతో, ఎలాంటి అవినీతి చేయలేదని, వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనను హనుమాన్ గుడికి వెళ్లడాన్ని అడ్డుకుని హౌజ్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో పోలీసులు, మీడియా అన్నింటి కంటే ఎక్కువగా తన ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేశానని చెప్పారు.
మీరు చేసిన సవాలుకు దేవుడి సాక్షిగా నా నిజాయితీ నిరూపించుకునేందుకు నేను తడి బట్టలతో ప్రమాణం చేశాను. నేను ఎక్కడ కూడా ఒక అవినీతి చేయలేదు.. చేసే అవుసరం నాకు లేదు.. చెయ్యను కూడా అని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కు నేను కూడా సవాల్ చేస్తున్నా. రేపు 12 గంటలకు నువ్వు అపోలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వచ్చి నా సవాల్ ని స్వీకరించి నీ నిజాయితీ నిరూపించుకో.. ఒకవేళ నువ్వు రాకపోతే నువ్వు అన్ని స్కామ్ లు చేసినట్లే.. అక్రమంగా నువ్వు వేల కోట్ల రూపాయలు దోచుకున్నావని ఒప్పుకున్నట్టే అన్నారు. ఫ్లైయాష్ తరలింపు, ఓవర్ లోడ్ లారీల నుంచి డబ్బులు తీసుకోలేదని పొన్నం ప్రమాణం చేస్తే తాను క్షమాపణ చెప్తానన్నారు. అప్పటి దాకా పొన్నంపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానన్నారు.