ఇన్నేళ్లుగా BRSలో ఉన్న ఆయన కేసీఆర్ కు ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam srinivas reddy) కాంగ్రెస్ పార్టీలో చేరడంపై కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(Jeevan reddy) వ్యతిరేకత వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి(Revanth reddy) పార్టీలోకి ఆహ్వానించడంతో పోచారం కాంగ్రెస్(congress) తీర్ధం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన పోచారం.. రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. దీంతో అటు BRS క్యాడర్(cader)తో పాటు రాష్ట్ర ప్రజలు కూడా దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్నేళ్లుగా BRSలో ఉన్న ఆయన కేసీఆర్(kcr)కు ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. తాజగా, ఏ అంశంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా స్పందించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయనను.. పోచారం కాంగ్రెస్ లో చేరడంపై విలేకర్లు ప్రశ్నించారు.
వారి ప్రశ్నలకు సమాధానం చెప్పిన జీవన్ రెడ్డి.. రాష్ట్రంలో ఇప్పటికే 65 మంది ఎమ్మెల్యే సభ్యులతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం ఉందని నేను భావించట్లేదు అని అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేయాలి, పని చేయాలని ఆయన సూచించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరిక అవకాశవాదానికి నిదర్శనంగా భావిస్తున్నానని తెలిపారు. ఇలాంటి వాటిని అస్సలు ప్రోత్సహించనని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.