కాంగ్రెస్ సర్కార్ తీసుకువచ్చిన మహాలక్ష్మి పథకంతో మహిళలు ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేస్తున్నారు. దీంతో బస్సుల కొరత ఏర్పడిందో ఏమోకానీ కొన్ని చోట్ల బస్సులను తగ్గిస్తున్నారు.
కాంగ్రెస్ సర్కార్ తీసుకువచ్చిన మహాలక్ష్మి పథకంతో మహిళలు ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేస్తున్నారు. దీంతో బస్సుల కొరత ఏర్పడిందో ఏమోకానీ కొన్ని చోట్ల బస్సులను తగ్గిస్తున్నారు. గతంలో కరీంనగర్-గంగాధర మండలం న్యాలకొండపల్లి గ్రామానికి రెండు బస్సులు నడిపేవారు. కానీ ఇప్పుడు ఒకే బస్సు నడపడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
న్యాలకొండపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో 750 మంది విద్యార్థులు చదువుతుండగా.. బస్సు ట్రిప్పును తగ్గించడంతో బస్సులో 200 మంది వరకూ ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకే బస్సు రెండు ట్రిప్పులను నడపడంతో ఒక్కో ట్రిప్పులో 200 మంది ప్రయాణించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో దయచేసి తమ గ్రామానికి మరో బస్సు కేటాయించాలని కోరుతున్నారు. విద్యార్థులకు ఏమైనా జరిగితే దానికి బాధ్యత ఎవరు అని ప్రశ్నిస్తున్నారు.