వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రముఖులు ఆర్ధిక సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో విక్రమ్ కేరళ చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్‌కు రూ.20లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
న్యూస్ లైన్ డెస్క్: వయనాడ్ విపత్తులో మృతిచెందిన వారి సంఖ్య 204కు చేరింది. ఇంకా 600 మంది ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రత్యేక బృందాలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వయనాడ్ సహా మరో నాలుగు జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇడుక్కి, త్రిశూర్, వయనాడ్, పాలక్కడ్, కన్నూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శనివారం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
వాయనాడ్ బాధిత కుటుంబాలకు ఆర్ధిక సహాయం
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రముఖులు ఆర్ధిక సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో విక్రమ్ కేరళ చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్‌కు రూ.20లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
అంతేకాకుండా అదానీ గ్రూప్ ఛైర్మన్ ట్వీట్ గౌతమ్ అదానీ కూడా తన వంతు సహాయం చేస్తానని తెలిపారు. ఈ మేరకే వయనాడ్ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు భారీ విరాళాన్ని ప్రకటించారు. కేరళ సీఎం సహాయ నిధికి రూ.5కోట్లు అందజేస్తున్నట్లు తెలిపారు.