మన్ననూరు చెక్‌పోస్ట్ వద్ద సలేశ్వరం వెళ్లే వాహనాలు టోల్ రుసుము చెల్లించే క్రమంలో ఆలస్యం అవుతుండటంతో రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సిద్ధాపూర్ క్రాస్ వరకు రద్దీ నెలకొంది. దీంతో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : సలేశ్వరం జాతరకు భక్తులు పోటెత్తడంతో శ్రీశైలం రహదారిపై 6 కిలోమీటర్ల మేర ట్రాపిక్ జామ్ అయ్యింది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో సలేశ్వరంలో ప్రతి యేడాది చైత్రపౌర్ణమి సంధర్భంగా మూడు రోజుల పాటు లింగమయ్య స్వామి జాతర నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. వరుస సెలవుల వల్ల శ్రీశైలానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో శ్రీశైలం హైవే లో దాదాపు 6 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మన్ననూరు చెక్‌పోస్ట్ వద్ద సలేశ్వరం వెళ్లే వాహనాలు టోల్ రుసుము చెల్లించే క్రమంలో ఆలస్యం అవుతుండటంతో రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సిద్ధాపూర్ క్రాస్ వరకు రద్దీ నెలకొంది. దీంతో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.