రోజు భార్యకు దగ్గరగా మాత్రం ఉంటాడు నా వల్ల కావడం లేదు. నాకు విడాకులు ఇప్పించి పుణ్యం కట్టుకొండి సార్ అంటూ పోలీసులను ఆశ్రయించింది. కోర్టుకు కూడా వెళ్లింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కొంతమంది ఉంటారు..ఓసీడీ ...పరిశుభ్రతకు ప్రాణం ఇస్తారు. మరికొంతమంది ఉంటారు లేజీనెస్ బ్రాండ్ వీళ్లు..వారానికే స్నానం...రోజుకి ఒకటే పని...ఇలా నడిపించేస్తుంటారు. అసలు ఈ రెండు అలవాట్లు ఉన్నవాళ్లు భార్యాభర్తలు అయితే ఏం చేస్తారు చెప్పండి. సేమ్ ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి ఘటనే జరిగింది. భార్యకు శుచి శుభ్రత ఎక్కువ ..భర్తకు ఇవన్నీ తక్కువ. రోజు స్నానం చెయ్యడు కాని ..రోజు భార్యకు దగ్గరగా మాత్రం ఉంటాడు నా వల్ల కావడం లేదు. నాకు విడాకులు ఇప్పించి పుణ్యం కట్టుకొండి సార్ అంటూ పోలీసులను ఆశ్రయించింది. కోర్టుకు కూడా వెళ్లింది.
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో చోటు చేసుకుంది. రాజేష్ అనే వ్యక్తి నెలకు ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే స్నానం చేస్తాడట. రోజు పనికి వెళ్తాడు..సంపాదిస్తాడు..ఇళ్లు చూసుకుంటాడు అన్ని ఉన్నాయి కాని స్నానం చెయ్యడు. నేను ఆ కంపును భరించలేను స్వామి అంటుంది భార్య.
వీరికి పెళ్లై 40 రోజులు అయ్యిందని అప్పటి నుంచి ఇప్పటికి 6 సార్లు మాత్రమే స్నానం చేశాడని ..శరీరం నుంచి వచ్చే వాసనను భరించలేకపోతున్నానని వాపోయింది. అయితే ఆగ్రాలోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించింది. దీంతో ఈ నెల 22న కౌన్సెలింగ్ సెంటర్ కు రావాలని భార్యాభర్తలిద్దరికీ అధికారులు సూచించారు. పోలీసులను చూడగానే రాజేష్ తను రోజు స్నానం చేస్తానని ...కేసులు వద్దని తెలిపాడట.