RTC: ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ 

ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఆర్టీసీ కండక్టర్ పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు.


Published Jul 05, 2024 03:52:45 PM
postImages/2024-07-05//1720174965_buswomen.PNG

న్యూస్ లైన్ డెస్క్: ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఆర్టీసీ కండక్టర్ పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. ముషీరాబాద్ డిపోనకు చెందిన 1 జెడ్ రూట్ బస్సులో శుక్రవారం శ్వేతా రత్నం అనే గర్భిణీ ఆరాంఘర్‌లో ఎక్కారు. బహదూర్ పూరా వద్దకు రాగానే ఆమెకు పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి. దాంతో ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ ఆర్. సరోజ అప్రమ త్తమై మహిళా ప్రయాణికుల సాయంతో సాధారణ ప్రసవం చేశారు. ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. 

అనంతరం మెరుగైన వైద్యం కోసం సమీపంలోని గవర్నమెంట్ మెటర్నటీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లిబిడ్డా క్షేమంగా ఉన్నారు. బస్సులోనే కాన్పు చేసి మానవత్వం చాటు కున్న కండక్టర్ సరోజతో పాటు సహా మహిళా ప్రయాణికులను టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అభినందనలు తెలియజేశారు. అప్ర్రమత్తమై సకాలంలో స్పందించడం వల్లే తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు సేవా స్ఫూర్తిని ఆర్టీసీ సిబ్బంది చాటుతుండటం ప్రశంసనీ యమని అన్నారు.

newsline-whatsapp-channel
Tags : india-people rtc free-bus

Related Articles