నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ నివాసంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలో ఏసీబీ అధికారులు కొట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ నివాసంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలో ఏసీబీ అధికారులు కొట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్‌పై నమోదైన కేసులో భాగంగా ఆయన నివాసంపై శుక్రవారం ఏసీబీ దాడులు నిర్వహించింది. అయితే ఈ దాడుల్లో భారీగా నగదు, ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి.
ఇంట్లో రూ. 2,93,81,000 కోట్ల నగదును, రూ. 1,10,00000 కోట్లు బ్యాంకు బ్యాలెన్స్ ను నరేందర్, అతని భార్య, అతని తల్లి ఖాతాల్లో ఉన్నాయి. అదనంగా 51 తులాల బంగారం, 17 స్థిరాస్తుల విలువ రూ. 1.98 కోట్లు అతని ఇంట్లో గుర్తించిన ఏసీబీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
అయితే నరేందర్ ఇంటితో పాటు కార్యాలయం, బంధువుల ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 6.07 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడ్ని ఏసీబీ కోర్టు ముందు హాజరు పరచనున్నట్లు అధికారులు తెలిపారు.