Kodangal : సీఎం ఇలాకాలో రొడ్డెక్కిన అంగన్వాడీలు

Published 2024-07-05 04:51:04

postImages/2024-07-05/1720169187_2.jpeg

న్యూస్ లైన్ డెస్క్ : ఓవైపు టీజీపీఎస్సీ దగ్గర నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి   సొంత నియోజకవర్గం కొండగల్ లో అంగన్ వాడీ టీచర్లు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించడం లేదని నిరసన తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అంగన్ వాడీలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రికత్త పరిస్ధితులు నెలకొన్నాయి.

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లో కదం తొక్కిన అంగన్వాడి కార్యకర్తలు. ఈ నేపథ్యంలో వికారాబాద్ జిల్లా  కొడంగల్ నియోజకవర్గం ప్రధాన రహదారిపై ఉద్రిక్తత చోటు చేసుకున్నది.ఈ సందర్భంగా  పలువురు మాట్లాడుతూ పనికి తగ్గ వేతనం ఇస్తామని ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో తెలియజేశారు. అయితే ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మమ్ములను పట్టించుకోవడం లేదని పలుకురు ఆవేదన వ్యక్తం చేశారు. మాతోని పెట్టుకుంటే మంచిగ ఉండదని సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. 
 మేము చేతకాని వాళ్లం కాదు, మాతో పెట్టుకుని, మా మీద గుర్రాలతో తొక్కించిన  మీ గురువు చంద్రబాబు నాయుడిని అధికార కుర్చీ మీద నుంచి లాగి కింద పడేసిన చరిత్ర మాది అని అని వారు ఘాటుగా హెచ్చరించారు. ఈ ముఖ్యమంత్రి, ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, కార్యకర్తలు మనల్ని బతిమాలి ఓట్లు వేయింకున్నారు అన్నారు. ఈ రోజు ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన చందాన మన సమస్యలని పట్టించుకోవడం లేదని అన్నారు.  మా అంగన్వాడి ధర్నాలతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆందోళకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో తరలించారు. అంగన్వాడీలకు నష్టం కలిగించే జీవో18 వెంటనే రద్దు చేయాలని అన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.