వేలాది మంది తాత్కాలిక పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. ఉత్తరాంధ్ర మొత్తం వరద ముంపుకి చాలా ఇబ్బందులుపెడుతున్నారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: వరద ముంపులో విజయవాడ అల్లాడిపోతుంది. ముసలిముతక , పిల్లలు, గర్భిణిలు వరద ముంపుకి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎటు చూసినా మోకాళ్ళ లోతు వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నాలుగు రోజులుగా వేలాది మంది ప్రజలు జలదిగ్బంధంలో ఉన్నారు. వేలాది మంది తాత్కాలిక పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. ఉత్తరాంధ్ర మొత్తం వరద ముంపుకి చాలా ఇబ్బందులుపెడుతున్నారు.
ఈ విజయవాడ దుర్ఘటన లో చాలా మంది యువకులు వాలంటీర్లు గా పనిచేస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారు. అయితే ఈ వరదల్లో సాయం చేయడానికి వెళ్లిన చంద్రశేఖర్ అనే వ్యక్తి నలుగురిని కాపాడి తను ప్రాణాలు వదిలేశాడు.
సింగ్ నగర్లోని డెయిరీఫాంలో పనిచేస్తుండగా వరద పోటెత్తింది. చంద్ర ఆ నలుగురిని కాపాడి షెడ్డు పైకప్పు మీదకు చేర్చాడు. తాళ్లతో కట్టేసిన ఆవులనూ వదిలేశాడు. తాను పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా కాలు జారి వరదలో కొట్టుకుపోయాడు. ప్రస్తుతం అతని భార్య 8 నెలల గర్భిణి . ఇలాంటి టైంలో చంద్రశేఖర్ మరణం చుట్టుప్రక్కల వారి మనసు కరిగించేస్తుంది.