సాధారణంగా బొప్పాయి పండు అనేది పేద మధ్యతరగతి వారందరికీ అందుబాటులో ఉండేటువంటి ఆహార పదార్థం. పూర్వకాలంలో ప్రతి ఇంటికి బొప్పాయి చెట్టు ఉండేది. బొప్పాయి మార్కెట్ వెళ్లి కొనుక్కునే పరిస్థితి ఎవరికి
న్యూస్ లైన్ డెస్క్: సాధారణంగా బొప్పాయి పండు అనేది పేద మధ్యతరగతి వారందరికీ అందుబాటులో ఉండేటువంటి ఆహార పదార్థం. పూర్వకాలంలో ప్రతి ఇంటికి బొప్పాయి చెట్టు ఉండేది. బొప్పాయి మార్కెట్ వెళ్లి కొనుక్కునే పరిస్థితి ఎవరికి ఉండేది కాదు. కానీ ప్రస్తుత కాలంలో బొప్పాయి పండు కూడా మార్కెట్ లో ఒక డిమాండ్ ఉన్న ఫ్రూట్ అయిపోయింది. ఎందుకంటే బొప్పాయిలో ఉండేటువంటి ఔషధ గుణాలు దాని రేటును పెంచేసాయి. బొప్పాయి పండే కాకుండా దాని గింజలు, ఆకులు కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి మనల్ని బయటపడేస్తాయి. అలా ఇన్ని పోషకాలు ఉండేటువంటి బొప్పాయిని ఎవరైనా అమితంగా తింటారు. మరి అలాంటి బొప్పాయిని ఓ మోతాదులో తప్ప ఎక్కువగా తీసుకుంటే దుష్ఫలితాలు కూడా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.. అవేంటో చూద్దాం..
జీర్ణక్రియ:
కొంతమంది బొప్పాయి ఉంది కదా అని అతిగా లాగించేస్తారు. అలా తినడం వల్ల జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయట.. ముఖ్యంగా గ్యాస్, అతిసారం వంటి సమస్యలకు దారితీస్తుందట. కాబట్టి అతిగా తినకపోవడం మంచిది.
ఎలర్జీ:
కొద్దికొద్దిగా ఎలర్జీ సమస్యలు ఉన్నవారు ఈ బొప్పాయి పండును ఎక్కువగా తినకపోవడమే మంచిది. దీనివల్ల ఎలర్జీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందట. ముఖ్యంగా చర్మంపై ఉబ్బరం, దురద, దద్దుర్లు, శ్వాస సమస్యలు వస్తాయట.
రక్తం గడ్డకట్టడం:
ముఖ్యంగా బొప్పాయి పండులో ఉండేటువంటి లాటెక్స్ అనే పదార్థం రక్తం గడ్డకట్టే ప్రక్రియను వేగవంతం చేస్తుందట. కాబట్టి రక్తం గడ్డ కట్టే సమస్యలు ఉన్నటువంటి వ్యక్తులు బొప్పాయిని ఎక్కువగా తినకపోవడమే మంచిదని అంటున్నారు.
గర్భస్రావం :
ముఖ్యంగా గర్భంతో ఉన్నటువంటి స్త్రీలు బొప్పాయిని మితంగా కాకుండా అమితంగా తింటే గర్భస్రావం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందట. కాబట్టి ఇది తినకపోవడమే మంచిది.