TGSPSC ఆవరణలో తిరుగుతున్న సామాన్యులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము వచ్చింది తెలిపేందుకు కాదని, రోడ్డుపై నడుకుంటూ వెళ్తున్నామని, ధమనుల అరెస్ట్ చేయవద్దని రైతులు, లాయర్, సామాన్యులు వేడుకున్నప్పటికీ పోలీసులు వినిపించుకోవడం లేదు.
న్యూస్ లైన్ డెస్క్: TGSPSC ముట్టడికి నిరుద్యోగులు పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడికి పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో విద్యార్థి సంఘాల నాయకులు, BRSV కార్యకర్తలు, నిరుద్యోగులు అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
ఇప్పటికే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నిరుద్యోగులు TGSPSCకి వెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్నారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా నిరుద్యోగులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన సాయి చంద్ సతీమణి రజినీని కూడా అరెస్ట్ చేశారు. ఆందోళనలు చేపడుతున్న BRSV కార్యకర్తలతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను కూడా అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు.
అయితే, TGSPSC ఆవరణలో తిరుగుతున్న సామాన్యులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము వచ్చింది తెలిపేందుకు కాదని, రోడ్డుపై నడుకుంటూ వెళ్తున్నామని, ధమనుల అరెస్ట్ చేయవద్దని రైతులు, లాయర్, సామాన్యులు వేడుకున్నప్పటికీ పోలీసులు వినిపించుకోవడం లేదు. సొంత పనుల మీద వెళ్తున్న వారిని కూడా అరెస్ట్ చేసి బస్సులో ఎక్కించారు. సాధారణ ప్రజల మాటలను పట్టించుకోకుండా పోలీసు వాహనంలోకి ఎక్కించి అక్రమంగా ఠాణాకు తరలించారు.
ఇది ఇలా ఉండగా.. కాంగ్రెస్ కండువాలు కప్పుకొని అక్కడ తిరుగుతున్న వారిని మాత్రం పోలీసులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ వారు తప్ప ఎవరు కనిపించినా అరెస్ట్ చేస్తున్న పోలీసులు.. https://t.co/g3uGp7ml94 pic.twitter.com/5niabMAixo — News Line Telugu (@NewsLineTelugu) July 5, 2024