DSC: కాళ్లపై పడ్డా కనికరించని కాంగ్రెస్ సర్కార్

ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలు కనీసం పట్టించుకోవట్లేదు అని ఓ నిరుద్యోగి పోలీసుల కాళ్లపై పడ్డాడు. నిర‌స‌న‌లు తెలిపేందుకు అవ‌కాశం ఇవ్వాలని పోలీసు ఆఫీస‌ర్ కాళ్లు మొక్కి వేడుకున్నాడు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-08/1720435235_polcon.PNG

న్యూస్ లైన్ డెస్క్: డీఎస్సీ పరీక్ష వాయిదా వేసి పోస్టులు పెంచాలని నిరుద్యోగులు కొన్ని నెలలుగా డిమాండ్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడంలేదు. డీఎస్సీ పరీక్షను 3 నెలలు వాయిదా వేయాలని కోరుతూ సోమవారం రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయాన్ని నిరుద్యోగులు ముట్టడించారు. ప్రభుత్వం డీఎస్సీ పరీక్షల తేదీలను వాయిదా వేసి, మెగా డీఎస్సీని ప్రకటించాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. అయితే నిరుద్యోగుల నిరసనలపై నిర్బంధం విధించి అక్రమ అరెస్టులు చేస్తున్నారని ప్రభుత్వంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలు కనీసం పట్టించుకోవట్లేదు అని ఓ నిరుద్యోగి పోలీసుల కాళ్లపై పడ్డాడు. నిర‌స‌న‌లు తెలిపేందుకు అవ‌కాశం ఇవ్వాలని పోలీసు ఆఫీస‌ర్ కాళ్లు మొక్కి వేడుకున్నాడు. తాము శాంతియుతంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నామని, ఎలాంటి అరాచ‌కాల‌కు పాల్ప‌డ‌డం లేదని అభ్యర్థి వేడుకున్నాడు. నిరుద్యోగుల డిమాండ్ల‌ను ప్ర‌భుత్వానికి విన్న‌వించుకుంటున్నామ‌ని పేర్కొన్నాడు. ఇప్పటీ కాంగ్రెస్ ప్రభుత్వం కంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం వంద రెట్లు నయం అంటూ నిరుద్యోగులు తెలిపారు. 

newsline-whatsapp-channel
Tags : telangana students congress police

Related Articles