మంత్రి కొండా సురేఖ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపించారు. మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా
24 గంటల్లో క్షమాపణలు చెప్పాలి
లేదంటే పరువు నష్టం దావా వేస్తా
కావాలనే అసత్య ప్రచారాలు
మహిళ అయ్యుండి మరో మహిళ పేరు
వాడుకోవడం దురదృష్టకరం!
హోదా మరిచి అడ్డగోలు అసత్యాలు
సంబంధం లేని విషయాల్లోకి లాగుతున్నరు.!
మంత్రి కొండా సురేఖ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపించారు. మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. 24 గంటల్లో తనకు బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే.. ఆమె మీద పరువు నష్టం దావాతోపాటు క్రిమినల్ కేసులు కూడా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు. సంబంధం లేని విషయాల్లోకి తనను లాగుతున్నారని మండిపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్, సినీ పరిశ్రమకు చెందిన వారితో సంబంధాలు అంటగట్టడం వంటి విషయాలు తన గౌరవానికి భంగం కలిగించేవని అన్నారు. ఒక మహిళ అయ్యుండి ఇంకొక మహిళ పేరును, సినిమా నటుల పేరును వాడుకొని వారి వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడడం దురదృష్టకరమన్నారు. తన హోదాను కూడా మరచిపోయి కొండా సురేఖ అడ్డగోలు అసత్యాలు మాట్లాడారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించకుండా ఉంటే ప్రజలు వాటిని నిజమనుకునే ప్రమాదం ఉందన్నారు. గతంలో కూడా తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే, ఏప్రిల్ లో లీగల్ నోటీసులు పంపించానని గుర్తు చేశారు.