అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో బుధవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో బుధవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం లో ఫార్మా కంపెనీ ఉద్యోగులు 17 మంది చనిపోయారు. దాదాపు 60 మంది తీవ్రగాయాలయ్యాయి.ఈ ప్రమాదంలో అక్కడ పనిచేసే సిబ్బంది 30 నుంచి 50 మీటర్ల దూరం ఎగిరి పడిపోయి. దీని వల్లే ఎక్కువ మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. మృతి చెందిన కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేలు అందించనున్నట్లు తెలిపారు.
ఘటనపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పందిస్తూ... ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.శుక్రవారం జగన్ వారి పలకరిస్తారని తెలిపారు. వైసీపీ బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ రోజు చంద్రబాబు అచ్యుతాపురం పర్యటిస్తారు.
ప్రస్తుతం క్షతగ్రాతులకు చికిత్స అందుతుంది. ఇక ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఘటన జరగడానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక నివేదిక ప్రకారం.. రియాక్టర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరగలేదని.. సాల్వంట్ లీకేజీ వల్ల ఘటన చోటు చేసుకుందని అంటున్నారు. యాజమాన్యం వల్లే నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటున్నారు.