దివ్యాంగుల మనోభావాలను, భారత రాజ్యాంగం వారికి కల్పించిన హక్కులను భంగపరిచే విధంగా ప్రవర్తించారంటూ స్మితా సబర్వాల్ పై కాంగ్రెస్ నాయకుడు బక్క జడ్సన్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: దివ్యాంగులపై మహిళ ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ వ్యక్తం చేసిన అభిప్రాయంపై సర్వత్ర విమర్శలు, ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. దేశంలోని కోట్లాదిమంది దివ్యాంగుల మనోభావాలను, భారత రాజ్యాంగం వారికి కల్పించిన హక్కులను భంగపరిచే విధంగా ప్రవర్తించారంటూ స్మితా సబర్వాల్ పై కాంగ్రెస్ నాయకుడు బక్క జడ్సన్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి స్మిత సబర్వాల్ మిగతా క్యాడర్ అధికారులకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు పట్ల కాంగ్రెస్ నాయకుడు బక్క జడ్సన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిభా అనేది ఎవరి సొత్తు కాదన్నారు. వైకల్యాలు, శక్తి సామర్థ్యాలు మేధోశక్తి పై ప్రభావం చూపదన్నారు. ఓ ఐఎఎస్ అధికారి వికలాంగులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తన స్థాయిని దిగజారుస్తోందని తెలిపారు. ఆమె వెంటనే దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.