నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సెప్టెంబర్ 30కి తో 50 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా బాలయ్య బాబుకు గోల్డెన్ జూబ్లీ వేడుకలను సినిమా పరిశ్రమ అట్టహాసంగా
న్యూస్ లైన్ డెస్క్: నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సెప్టెంబర్ 30కి తో 50 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా బాలయ్య బాబుకు గోల్డెన్ జూబ్లీ వేడుకలను సినిమా పరిశ్రమ అట్టహాసంగా నిర్వహిస్తోంది. సెప్టెంబర్ ఒకటవ తేదీ సాయంత్రం జరిగే ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. అంతేకాదు ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర రాజకీయ నాయకులతో పాటు సినిమా ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు నిర్మాతలు, డైరెక్టర్లు ఇలా ఎంతోమందికి ఆహ్వానం అందింది.
ఇందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు అమితాబ్ బచ్చన్ పవన్ కళ్యాణ్, చిరంజీవి, లాంటివి వారికి కూడా ఆహ్వానం అందింది. ఇక వీరే కాకుండా అల్లు అర్జున్, అల్లు అరవింద్ వంటి వారికి కూడా ఆహ్వానం ఇప్పటికే అందించారట. అంతేకాదు వీరిని ఆహ్వానించే ఫోటోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇలా అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ వేడుకకు ఆ ఇద్దరు హీరోలకు మాత్రం ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. ఇంతకీ వారు ఎవరయ్యా అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్.
అయితే ఇప్పటివరకు వీరికి ఆహ్వానం అందించినట్టు ఎక్కడ వార్తలు వినిపించలేదు, ఫోటోలు కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం వారు చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో కానీ ఏ సమయంలో కానీ పార్టీకి అండగా ఉండడం లేదట. 2009 ఎన్నికల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దీనికి సంబంధించిన విషయాలను ఎక్కడా కూడా పట్టించుకోవడం లేదు. అంతేకాదు టీడీపీపై విపరీతమైనటువంటి విమర్శలు చేసే తన అనుచరులైన కొడాలి నాని, వల్లభనేని వంశీ అని కూడా ఆయన నియంత్రించే ప్రయత్నం చేయలేదు. దీంతో వారు చంద్రబాబు, బాలయ్య, లోకేష్ పై అనేక అవాకులు చవాకులు మాట్లాడారు.
మరి వారి కుటుంబాన్ని అన్నా కానీ ఎప్పుడూ కూడా స్పందించకపోవడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొత్తం ఎన్టీఆర్ పై మండిపడుతున్నారు. అంతేకాదు కళ్యాణ్ రామ్ సినీ విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ సమస్యలను జూనియర్ ఎన్టీఆర్ తీర్చారు. దీంతో కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ వెంటే తిరుగుతున్నారు. అయితే ఇదే తరుణంలో తన బాబాయ్ బాలకృష్ణ 50 ఏళ్ల వేడుకకు వీరిద్దరికి ఆహ్వానం అందినట్టు అయితే కనిపించడం లేదు. మరి ఈ రోజైనా ఆహ్వానం అందుతుందా? లేదంటే డైరెక్ట్ గా ఫోన్ చేసి చెప్పారా? అనే విషయంపై క్లారిటీ రాలేదు. ఒకవేళ ఈ వేడుకకు వారు వస్తే ఆహ్వానం అందినట్టు రాకుంటే మాత్రం తప్పనిసరిగా వారిని బాలకృష్ణ దూరం పెట్టినట్టే అని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.