యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సీటు కోసం పోటీలో ఉన్నాడని మొన్నటి వరకు వార్తలొచ్చాయి. అయితే.. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది బల్మూరి వెంకట్ పోటీ ఊసే ఎత్తడం లేదని యూత్ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
న్యూస్ లైన్ డెస్క్ : తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్.ఎస్.యూ.ఐ అధ్యక్షుడిగా ఉండి.. ఎమ్మెల్సీ పొందిన బల్మూరి వెంకట్ సైతం యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సీటు కోసం పోటీలో ఉన్నాడని మొన్నటి వరకు వార్తలొచ్చాయి. అయితే.. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది బల్మూరి వెంకట్ పోటీ ఊసే ఎత్తడం లేదని యూత్ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
ఇప్పటికే ఎన్.ఎస్.యూ.ఐ ప్రెసిడెంట్ గా చేసిన వెంకట్.. ఆ మధ్య చేసిన కొన్ని రాజకీయాల వల్ల అధిష్టానం మనసు గెలిచి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నాడు. అయితే.. యూత్ కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి ఎన్నికలు జరుగుతుండటంతో ఆ స్థానానికి బల్మూరి పోటీ పడ్డాడు. ఈ మధ్య వచ్చిన వార్తల్లో అధిష్టానం ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకుడికి యూత్ కాంగ్రెస్ బాధ్యతలు ఇవ్వనుందని వార్తలొచ్చాయి. అయితే.. తాజాగా బల్మూరి వెంకట్ డబ్బులు తీసుకొని అధ్యక్ష పదవి ఎన్నికల పోటీలోంచి తప్పుకున్నాడని వార్తలొస్తున్నాయి. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా మిట్టపల్లి వెంకటేశ్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఇప్పటికే నామినేషన్ వేసిన వెంకటేశ్.. పోటీ నుంచి తప్పుకుంటే ఐదు కోట్లు ఇస్తానని ఆశ పెట్టడంతో బల్మూరి వెంకట్ అధ్యక్ష పోటీ నుంచి తప్పుకున్నాడని సమాచారం. బల్మూరి వెంకట్ ను పోటీ నుంచి తప్పించడంలో రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ముందుండి కథ నడిపించాడని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.