KTR : కేంద్రమంత్రిగా ఉండి.. బుద్ధిలేని మాటలా?

అలుపెరగని కష్టానికి ఈరోజు ప్రతిఫలం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ బెయిల్ విజయం అనేది కాంగ్రెస్, BRS రెండు పార్టీలకు చెందిందని ఆయన వెల్లడించారు. ఒక BRS సభ్యులు బెయిల్ మీద బయటకు వస్తే.. కాంగ్రెస్ నేతకు రాజ్యసభలోకి వెళ్లే అవకాశం లభించిందని బండి సంజయ్  కామెంట్ చేశారు.


Published Aug 27, 2024 06:07:14 AM
postImages/2024-08-27/1724753824_ktroncmdelhicourt.jpg

న్యూస్ లైన్ డెస్క్: కవితకు బెయిల్ రవీకాడం రావడం అనేది కాంగ్రెస్, BRS పార్టీల విజయమంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్ కు మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్ర హోం వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తూ ఇటువంటి కామెంట్స్ చేయడం సరికాదని ఆయన ట్వీట్ చేశారు. 

BRS ఎమ్మెల్సీకి ఒక ఫేమస్ కేసులో బెయిల్ వచ్చేలా చేసినందుకు కాంగ్రెస్, ఆ పార్టీకి చెందిన లాయర్లకు శుబాకాంక్షలు అంటూ బండి సంజయ్ ఈ రోజు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అలుపెరగని కష్టానికి ఈరోజు ప్రతిఫలం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ బెయిల్ విజయం అనేది కాంగ్రెస్, BRS రెండు పార్టీలకు చెందిందని ఆయన వెల్లడించారు. ఒక BRS సభ్యులు బెయిల్ మీద బయటకు వస్తే.. కాంగ్రెస్ నేతకు రాజ్యసభలోకి వెళ్లే అవకాశం లభించిందని బండి సంజయ్ వెల్లడించారు.

మొదట బెయిల్ కోసం వాదించిన అభ్యర్థిని అధికార కాంగ్రెస్ ఏకగ్రీవంగా రాజ్యసభకు నామినేట్ చేయడానికి మద్దతు ఇవ్వడంలో మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ కీలక పాత్ర పోషించారని ఆయన తెలిపారు. వైన్ & డైన్ చేసే క్రైమ్‌లో పార్ట్నర్లకు అభినందనలు అని ట్వీట్ చేశారు. ఈ విషయంపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కేంద్ర హోం వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తూ ఇటువంటి కామెంట్స్ చేయడం సరికాదని ఆయన ట్వీట్ చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు దీనిపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు. 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu supremecourt brs congress ktr telanganam bandi-sanjay mlc-kavitha latest-news

Related Articles