‘రాహుల్ దమ్ముంటే ఓయూలో తిరగగలవా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై సంచన వ్యాఖ్యలు చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: ‘రాహుల్ దమ్ముంటే ఓయూలో తిరగగలవా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై సంచన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నిరుద్యోగం అంటువ్యాధిలా విస్తరిస్తోందని ఆయన హెచ్చరించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. అశోక్ నగర్‌లో రాహుల్ గాంధీ వచ్చి అడ్డగోలు హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రభుత్వం చేతులెత్తేశారు. డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు, విద్యార్థులు ధర్నా చేస్తుంటే ప్రభుత్వం మాత్రం వారి సమస్యలను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో మళ్లీ ఉద్యమం మొదలైందని అన్నారు. ప్రభుత్వం వెంటనే నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణలోనే దేశానికి ‘మోడీ’ యే గ్యారంటీ అని నిరూపించారన్నారు. 8 ఎంపీ స్థానాలు గెలిపించిన ‘తెలంగాణ ప్రజలకు’ తనకు అవకాశం ఇచ్చారన్నారు. ప్రధాని కాగానే కిసాన్ సమ్మాన్ నిధిపై మోడీ సంతకం చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయం అని జనం తేల్చేశారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అన్నారు. కార్యకర్తల కష్టార్జితంతోనే బీజేపీ గెలిచిందని ఆయన అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, 3వ సారి మోడీ ప్రభుత్వానికి అవకాశమిచ్చిన తెలంగాణ ప్రజలకు సంజయ్ ధన్యవాదాలు తెలిపారు.