ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా అవమానిస్తారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. అందరికీ సమానంగా నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వంపై తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు.
న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్(congress) ఎన్నో దుర్మార్గాలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాలకే నిధులు వస్తున్నాయని.. బీజేపీ అధికారంలో ఉన్న ప్రాంతాల్లో బిల్లులు విడుదల చేయడంలేదని ఆయన అన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ(BJP) కూడా ఇలాగే ప్రవర్తిస్తే.. కాంగ్రెస్ ఎంపీ(MP)ల పరిస్థితి ఏమవుతుందని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా అవమానిస్తారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. అందరికీ సమానంగా నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వంపై తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు.
అనంతరం తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తుపై స్పందించిన బండి సంజయ్.. ఈ అంశంపై బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. బీజేపీతో జనసేన పొత్తు తన పరిధిలో లేదని.. దానిపై తానేమీ మాట్లాడనని అన్నారు.