గత కొన్ని రోజులుగా దేశంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కాగా అదే తరహాలో హైదరాబాద్ నగరంలోని బేగంపేట్ విమానాశ్రయానికి (Begumpet Airport) బాంబు బెదిరింపులు (Bomb Threat) వచ్చాయి. ఈ విషయం పోలీసువర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
న్యూస్ లైన్ డెస్క్ : గత కొన్ని రోజులుగా దేశంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కాగా అదే తరహాలో హైదరాబాద్ నగరంలోని బేగంపేట్ విమానాశ్రయానికి (Begumpet Airport) బాంబు బెదిరింపులు (Bomb Threat) వచ్చాయి. ఈ విషయం పోలీసువర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెయిల్ ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఆగంతకుల మెయిల్‌తో అప్రమత్తమైన పోలీసులు (Police) బాంబ్ స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్‌తో తనిఖీలు చేపట్టారు. అయితే, పోలీసుల తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ కనిపించలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మెయిల్ ఐడీ ఆధారంగా ఆగంతకులను గుర్తించే పనిలో పడ్డారు.