గురుకులాల్లో చదివే పేద విద్యార్థులకు కనీస రక్షణ లేకుండా పోయిందని ప్రతిపక్షాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి స్పందన లేకపోవడం దురదృష్టకరమని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
న్యూస్ లైన్ డెస్క్: పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇటీవల మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల తల్లితండ్రులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. పాముకాటు కారణంగా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఘనాదిత్య, అనిరుధ్ ఇటీవల మృతిచెందారు. మరో నలుగురు విద్యార్థుల అస్వస్థతకు గురయ్యారు. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.
గురుకులాల్లో చదివే పేద విద్యార్థులకు కనీస రక్షణ లేకుండా పోయిందని ప్రతిపక్షాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి స్పందన లేకపోవడం దురదృష్టకరమని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి గాడితప్పుతున్న గురుకులాలను చక్కదిద్దాలని సూచించారు.
అయితే, మంగళవారం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇటీవల మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల తల్లితండ్రులను భట్టి, పొన్నం పరామర్శించారు. వారిని చూడగానే విద్యార్థుల తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. అధికారులు నిర్లక్ష్యం మా పిల్లల పాలిట శాపంగా మారిందని భట్టి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు విద్యార్థుల మృతి నలుగురు విద్యార్థుల సంబంధించిన సమగ్ర వివరాలను గురుకుల పాఠశాల ఇన్‌ఛార్జ్ మున్సిపల్ మహిపాల్ రెడ్డిని భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ అడిగి తెలుసుకున్నారు.