తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీల పాత్ర పోషించిన మిత్రుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అకాలమరణం బాధకారమంటూ ఆయన ట్వీట్ చేశారు. బాలకృష్ణారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తట్లు ఆయన తెలిపారు. జిట్టా కుటుంబసభ్యులకు భట్టి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి పట్ల పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. జిట్టా బాలకృష్ణారెడ్డి మృతిపై స్పందించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీల పాత్ర పోషించిన మిత్రుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అకాలమరణం బాధకారమంటూ ఆయన ట్వీట్ చేశారు. బాలకృష్ణారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తట్లు ఆయన తెలిపారు. జిట్టా కుటుంబసభ్యులకు భట్టి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కాగా, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జిట్టా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమం సమయంలో జిట్టా భువనగిరి ప్రాంతంలో కీలక పాత్ర పోషించారు. యువతెలంగాణ పార్టీ స్థాపించి తర్వాత బీజేపీలో విలీనం చేశారు.