Etela: మాట మార్చిన రేవంత్.. సంబరాలు ఎందుకు?

రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మార్చారు అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-18/1721302382_etela2.PNG

న్యూస్ లైన్ డెస్క్: రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మార్చారు అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రుణమాఫీ అంశంపై ఆయన మీడిమాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు అన్ కండిషనల్ గా రెండు లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ చెప్పారు. అలానే చేయాలి తప్ప, అనేక రకాల నిబంధనలు పెట్టి అందరిని ఎగరగొట్టే ప్రయత్నం చేయొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీఎం రైతులందరీకి రుణమాఫీ చేయాలి అంటే 34 వేల కోట్ల అవుతుందని చెప్పారు. ఇప్పుడు ఏదో ఐదు ఆరు వేలకోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని పండుగలాగా, ఏదో చారిత్రాత్మక దినం లాగా కాంగ్రెస్ ప్రభుత్వం వర్ణించే పిచ్చి ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. 

భారతదేశంలో రుణాలు ఎగవేతకు గురైన రైతులు ఎక్కడున్నారంటే తెలంగాణలో ఉన్నారు అనే అపకీర్తి గత ప్రభుత్వం తెచ్చిపెట్టింది. ఇవ్వాలున్నటువంటి ప్రభుత్వం భేషజాలకు పోకుండా అన్ కండీషనల్ గా రైతాంగానికి చెప్పిన విధంగా రుణమాఫీ చేసి, రైతులను రుణవిముక్తులను చేయాలని ఈటల ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు.

newsline-whatsapp-channel
Tags : india-people cm-jagan bjp etela-rajender runamafi

Related Articles