KCR: బడ్జెట్‌ పై కేసీఆర్ రియాక్షన్

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు.


Published Jul 25, 2024 04:38:10 AM
postImages/2024-07-25//1721898027_kkccrr.PNG

న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడారు. ఈ బడ్జెట్‌లో గ్యాస్, ట్రాష్ తప్ప ఏం లేదన్నారు. ఈ బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చెల్లిందన్నారు. రైతు భరోసా ప్రస్తావన లేదని, రైతులను పొగిడినట్లే పొగిడి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. గొర్రెల పంపిణీ పథకాన్ని పూర్తిగా మూసివేసినట్లు అర్థమవుతోందని, దళిత వర్గాల కోసం ప్రవేశపెట్టిన దళితబంధు ప్రస్తావన లేదన్నారు. ఈ ప్రభుత్వం ఏ ఒక్క పాలసీని తయారు చేయలేదని విమర్శించారు. మత్స్యకారులకు భరోసా లేదు ఈ బడ్జెట్‌లో అన్ని వర్గాలకు నిరాశే మిగిలిందని కేసీఆర్ ఆసహనం వ్యక్తం చేశారు. 

కొత్త ప్రభుత్వానికి 6 నెలలు సమయం ఇవ్వాలని మేము పెద్దగా ప్రశ్నించలేదు కానీ ఈ 6 నెలల్లో ప్రభుత్వం, రాష్టానికి సంబంధించి ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ చేయలేదన్నారు. మహిళలకు ఇస్తానన్న రుణాలు ఎప్పటి నుండో ఉన్న పథకమే అని వీళ్లు ఇప్పుడు ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ వ్యవసాయ స్థిరీకరణ కోసం రెండు పంటలకు రైతుబంధు ఇస్తే వీళ్ల అవగాహనలేమి వల్ల దానిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అన్నారు. ఇండస్ట్రియల్ పాలసీ ఏమి లేదు, దాని గురించి స్టోరీ టెల్లింగ్‌లా ఉంది తప్ప బడ్జెట్‌లా ఎది లేదన్నారు. వ్యవసాయ పాలసీ ఏమిటి, పారిశ్రామిక పాలసీ ఏమిటి, ఐటీ పాలసీ ఏమిటి, పేద వర్గాల మీద పాలసీ అనేది ఏమిటి అని ఏ ఒక్క అంశం లేదని కేసీఆర్ పేర్కొన్నారు.
 

newsline-whatsapp-channel
Tags : kcr india-people brs budjet

Related Articles