Kavitha: కవితతో ములాఖాత్ అయిన కేటీఆర్, హరీష్ రావు

ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో తీహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు శుక్రవారం ఉదయం ములాఖాత్ అయ్యారు


Published Jul 05, 2024 08:42:33 AM
postImages/2024-07-05/1720186716_bwithkavitha.PNG

 న్యూస్ లైన్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో తీహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు శుక్రవారం ఉదయం ములాఖాత్ అయ్యారు. ధైర్యంగా ఉండాలని, త్వరలోనే బెయిల్ లభిస్తుందని ఇరువురు ఆమెకు భరోసా ఇచ్చారు.  సుప్రీం కోర్టులో వేయనున్న బెయిల్ పిటీషన్ పై ఢిల్లీలో న్యాయ నిపుణుల బృందంతో కేటీఆర్, హరీష్ చర్చించారు. అయితే సుప్రీంకోర్టు సెలవులు ముగియగానే కవిత బెయిల్ పిటిషన్ పై సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బెయిల్ పిటిషన్ వేసే దాకా ఢిల్లీలోనే ఉండి న్యాయవాదుల బృందంతో కేటీఆర్, హరీష్ రావు సమన్వయం చేయనున్నారు. అయితే శుక్రవారం కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ కస్టడీని జులై 18వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ట్రయల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

newsline-whatsapp-channel
Tags : telangana brs ktr harish-rao mlc-kavitha

Related Articles