BRS: కాంగ్రెస్‌లో అంతర్గత గొడవలకు నిదర్శనమే చైర్మన్ పదవులు

రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమో సర్కస్ కంపెనీనో అర్థం కావడం లేదని రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-08/1720438909_yssatish.jpg

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమో సర్కస్ కంపెనీనో అర్థం కావడం లేదని రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 35 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తున్నట్టు పాత తేదీతో జీవో ఇవ్వడం ఏంటీ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన ఓ పద్ధతి పాడు లేకుండా ఉంటుందనడానికి ఇదే నిదర్శనం అన్నారు. సర్కారు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నప్పుడు అలా చేయకుండా చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్పొరేషన్ చైర్మన్లను నియమిస్తూ మార్చి నెల 15వ తేదీతో జీవో ఇవ్వడమే దీనికి నిదర్శనం అన్నారు. ఇవాళ జీవోలు బయటకు ఇచ్చారు, ఒక వేళ మార్చి 15వ తేదీనే జీవో ఇచ్చి ఉంటే ఇప్పటి దాకా ఎందుకు బయటకు రాలేదని నిలదీశారు. ప్రభుత్వ వెబ్ సైట్‌లో ఎందుకు పొందుపరచలేదు? నాలుగు నెలలుగా వీళ్లు బాధ్యతలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. 

ఇప్పుడు బాధ్యతలు తీసుకుని నాలుగు నెలల వేతనాలు తీసుకుంటారా? ప్రజల సొమ్ముని మీ పార్టీ నేతల జేబుల్లోకి మళ్లించుకుంటారా? ఏ పని చేయకుండా జనం సొమ్ము దోచుకుంటారా.? లేకపోతే జీవో ఇప్పుడే ఇచ్చి పాత తేదీ వేశారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి దీనిపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  మరోవైపు ఇది రాష్ట్ర కాంగ్రెస్ లోని అంతర్గత గొడవలకు నిదర్శనమని తెలిపారు. పదవుల పంపకాల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు కావట్టే ఇన్ని రోజులు ఆపారు అని విమర్శించారు. ఢిల్లీ వెళ్లి కుస్తీ పట్టారు ముఖ్యమంత్రి, మంత్రుల మధ్యే కార్పొరేషన్ పదవుల కోసం ఫైటింగ్ నడుస్తోందని అందుకే ఇన్ని రోజుల పాటు జీవోలు దాచిపెట్టారన్నారు. కాంగ్రెస్ సర్కారు పూర్తి కాలం ఉంటుందో లేదోననే భయం ఆ పార్టీకి పట్టుకుందన్నారు. అందుకే హడావుడిగా జీవోలు ఇచ్చినట్టుగా కనిపిస్తోందన్నారు. పదవీకాలం ఎక్కువ చూపించుకుని, తమవాళ్లకు జీతాల పేరుతో ప్రజాధనాన్ని దోచిపెట్టడానికే ఇదంతా చేస్తున్నారని పేర్కొన్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana brs congress cm-revanth-reddy

Related Articles