Krishank: నరసింహ రెడ్డి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు

చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నాక కూడా నరసింహ రెడ్డి ఆయన స్థాయిని మరచి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.


Published Jul 17, 2024 04:35:37 AM
postImages/2024-07-17/1721208612_narshi.jfif

న్యూస్ లైన్ డెస్క్: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ నరసింహ రెడ్డిని తప్పించాలని ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్‌ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యుత్ కమీషన్‌కు కేసీఆర్ లేఖ రూపంలో సమాధానమిచ్చారని, ఆ లేఖలో నరసింహ రెడ్డి వ్యక్తిగత విషయాలు కేసీఆర్ ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. నరసింహ రెడ్డి ప్రెస్ మీట్‌లో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను బాహాటంగా తప్పుబట్టారు. వీటిని పరిగణనలోకి తీసుకున్నాకే సుప్రీం కోర్టు నరసింహ రెడ్డిని చైర్మన్ భాధ్యతల నుంచి తప్పించింది అని తెలిపారు. చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నాక కూడా నరసింహ రెడ్డి ఆయన స్థాయిని మరచి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. కేసీఆర్‌పై, ఎమ్మెల్సీ కవితపై నరసింహ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ ఇంకా సమాధానం ఇవ్వలేదని అంటూనే రిపోర్టు సిద్ధం అయిందని నరసింహ రెడ్డి ఎలా అంటారు అని ప్రశ్నించారు. దీన్ని బట్టే నరసింహ రెడ్డి దురుద్దేశాలు అర్థమవుతున్నాయ అని, విచారణను ఎదుర్కొంటున్న కవితను ముందే దోషి అన్నట్టుగా నరసింహ రెడ్డి మాట్లాడారని తెలిపారు. నేరం నిరూపితం అయ్యేవరకు ఎవరూ దోషులు కారు, ఎదో చెత్త చేదారం అని నరసింహ రెడ్డి మాట్లాడారు అంటే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కూడా నరసింహ రెడ్డి తప్పుబడుతున్నారని పేర్కొన్నారు. 


సుప్రీం కోర్టు జడ్జిగా పని చేసిన నరసింహ రెడ్డి కోర్టుల అలసత్వం అని ఎలా అంటారు. కోర్టు తీర్పును తప్పుబట్టినట్టు మాట్లాడిన నరసింహ రెడ్డిపై రాజ్యాంగం 142 ఆర్టికల్ ప్రకారం చర్యలు ఎందుకు తీసుకోకూడదు అని నిలదీశారు. కాళేశ్వరంపై విచారణ చేస్తున్న జస్టిస్ ఘోష్ కూడా రోజూ మీడియాతో మాట్లాడుతున్నారని నరసింహ రెడ్డి అన్నారు దాని పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నరసింహ రెడ్డి భూ కబ్జాలపై కాంగ్రెస్ నేతలే ఉద్యమం చేశారు. ఆయన్నే విచారణ కమిషన్ చైర్మన్‌గా కాంగ్రెస్ ఎందుకు నియమించింది అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నరసింహ రెడ్డికి ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయని బహిరంగ రహస్యమే అని, నరసింహ రెడ్డిని విచారణ కమిషన్ చైర్మన్‌గా నియమించడం పై అసదుద్దీన్ ఒవైసీ ఎందుకు స్పందించలేదని మండిపడ్డారు. బీజేపీతో సంప్రదింపుల కోసం కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లారనే తప్పుడు వార్తలపై ఒవైసీ వివరణ కోరడంలో అర్థం లేదని, కాంగ్రెస్ బీజేపీల కుమ్మక్కుపై ఒవైసీ మాట్లాడాలని కోరారు. సుప్రీం కోర్టులో కేసుల విషయమై చర్చించేందుకే కేటీఆర్, హరీష్ రావులు ఢిల్లీ వెళ్లారు తప్ప రాజకీయాలు అందులో లేవు, రేవంత్ స్క్రిప్ట్‌నే నరసింహ రెడ్డి చదివారు అని తెలిపారు. నరసింహ రెడ్డిని చైర్మన్‌గా నియమించిన రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని క్రిశాంక్ డిమాండ్ చేశారు. బీజేపీతో సంబంధాలపై, కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎన్నో రోజులుగా చేసిన ఆరోపణలే మళ్ళీ చేస్తోందని, బీజేపీ కూడా కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ కుమ్మక్కు అంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కు అయితే కవిత జైలుకు ఎందుకు వెళ్తారు అని నిలదీశారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు అనేది వట్టి పుకారే అని, బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మకైతే ఇండియా కూటమి పక్షాలు శివ సేన, సమాజ్ వాదీ పార్టీ కవిత అరెస్టును ఎందుకు ఖండిస్తాయని ప్రశ్నించారు. అనవసర పుకార్లకు మీడియా ప్రాధాన్యత ఇవ్వొద్దు, ఒవైసీ మీడియాలో వచ్చిన పుకార్ల ఆధారంగా బీఆర్ఎస్‌ను వివరణ కోరడం భావ్యం కాదని మన్నె క్రిశాంక్ తెలిపారు. 

newsline-whatsapp-channel
Tags : india-people brs congress narasimha-reddy mannekrishank

Related Articles