రుణమాఫీకై రైతు రణం మొదలైందని బీఆర్‌ఎస్ నాయకుడు రాకేశ్ రెడ్డి అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: రుణమాఫీకై రైతు రణం మొదలైందని బీఆర్‌ఎస్ నాయకుడు రాకేశ్ రెడ్డి అన్నారు. నాడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరూదిన జనగామ చౌరస్తా రైతు రణానికి వేదికైందని అన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన "రుణమాఫీ కోసం బీఆర్‌ఎస్ రణం" కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీస్ రావు హాజరయ్యారు. ఈ సంద్భంగా రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో గట్టెక్కడం కోసం దేవుళ్లపై ఒట్లు వేసి మోసం చేసిన తీరును ఎండ గడుతూ బుధవారం యాదద్రి లక్ష్మి నరసింహ స్వామీ వారిని క్షమించమని వేడుకుని నేరుగా వచ్చారని తెలిపారు.
రాజు చేసిన పాపం ప్రజలకు కూడా తగిలే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ దైవాన్ని క్షమించమని ప్రార్థించారు అని అన్నారు. జనగామ బిడ్డల వారసత్వ పౌరుషాన్ని, తెగింపును చైతన్యాన్ని వివరించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ దాష్టీకం, రైతులకు జరుతున్న అన్యాయాన్ని వివరించారు. ఎమ్మెల్సీ దేశపతి చలోక్తులతో, కవితలతో, పాటలతో, సందేశాత్మక ప్రసంగంతో కాంగ్రెస్ ప్రభుత్వ దాష్టీకం కళ్ళకు కట్టినట్టు చూపారు. అటుగా వెళ్తున్న రైతు ఆ పోరాటం తనకోసమే అని తెలిసి హక్కుగా మైకు తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను, రైతుల పడుతున్న గోసను పూసగుచ్చినట్టు వివరించారు. కేసీఆర్ నాయకత్వానికి ప్రజలు జై కొడుతున్నారని రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు.